ప్రస్తుతం తెలుగు టెలివిజన్ తెరపై దూసుకెళ్తున్న జబర్దస్త్ షో నుండి మెగాబ్రదర్ నాగబాబు అర్ధాంతరంగా బయటకు రావడంతో ఆ షోకు కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. షో నుండి నాగబాబు తో పాటు అనసూయ భరద్వాజ్, చమ్మక్ చంద్ర కూడా నిష్క్రమించనుండగా, వారిని చూసి మిగతా మెయిన్ పార్టిసిపెంట్స్ కూడా షో ని విడిచే వెళ్తారని కొద్దిరోజలుగా వార్తలు ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. అయితే జడ్జిగా ఉన్న రోజా సహా మరికొందరు కలిసి వారిని వెళ్లకుండా పలు విధాలుగా బుజ్జగించి నచ్చజెప్పినట్లు టాక్. 

 

ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, జబర్దస్త్ లోని కొన్ని స్కిట్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటించే దుర్గారావు అనే పార్టిసిపెంట్ నిశ్చితార్ధం ఇటీవల ఎంతో వైభవంగా జరిగిందట. కొంచెం నత్తిగా మాట్లాడుతూ ఆడియన్స్ ని తన యాక్టింగ్ టాలెంట్ తో ఎంతో ఆకట్టుకునే దుర్గారావు గురించి మన ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది. మొదట కెమెరా మ్యాన్ గా వ్యవహరించిన దుర్గారావు, ఆ తరువాత మేకప్ ఆర్టిస్ట్ గా కూడా కొద్దిరోజలు పనిచేయడం జరిగింది. అనంతరం తనలోని యాక్టింగ్ టాలెంట్ తో జబర్దస్త్ షోలో ప్లేస్ సంపాదించిన దుర్గరావు, ఇప్పటివరకు పటాస్ ప్రకాశ్ టీం నుంచి ఇప్పటి హైపర్ ఆది

 

రాకింగ్ రాకేష్ లాంటి వ్యక్తుల స్కిట్స్ వరకు చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాగా మధ్యలో కొన్నాళ్ళు నిశ్చితార్ధం సమయంలో షోకు విరామం తీసుకున్న దుర్గరావు, ఇటీవల మళ్ళి షోలో నటించడం మొదలెట్టాడు. కాగా అతడి నిశ్చితార్ధం ఫోటోలు ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ వేడుకకు పలువురు జబర్దస్త్ నటులు కూడా హాజరయినట్లు తెలుస్తోంది. కాగా దుర్గారావు పెళ్లి అతి త్వరలో జరుగనుందని, రోజా సహా ఇతర పార్టిసిపెంట్స్ అందరూ పెళ్ళికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: