జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలు నుండి రాజకీయ జీవితం లోకి వచ్చిన తర్వాత ఎప్పుడూ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీపై మరియు ఇండస్ట్రీలో ఉన్న హీరోహీరోయిన్లపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. అయితే తాజాగా మాత్రం పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లపై మరియు అదే ఇంకా కొంతమంది పైకి తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్...పేద వారికి అందుబాటులో రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అందరికీ అందుబాటులో ఉండాలని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్య ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ నేపథ్యంలో జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు భాష మరియు సంస్కృతి కనుమరుగయ్యే అవకాశం ఉందని తెలుగు భాష గురించి పవన్ కళ్యాణ్ గత కొంత కాలం రాజకీయ వేదికలపై అనేక విమర్శలు చేయడం జరిగింది.

 

ఇటువంటి నేపథ్యంలో తాజాగా “మన భాషను కాపాడుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుండాం” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా పోరాటానికి సిద్ధమయ్యారు. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమపై ద్రుష్టి కేంద్రీకరించారు. అసలు ఎప్పుడు కూడా తన సొంత ఇల్లు లాంటి చిత్ర పరిశ్రమపై ఒక్క విమర్శ కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా మన హీరోలపై టార్గెట్ పెట్టారు. “మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని, అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా” అంటూ విమర్శలు చేశారు.

 

ప్రస్తుతానికి తెలుగు బాష దిగజారిపోతుందని, దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు అందరు నటులపై కూడా ఉందని గుర్తించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పట్ల చాలా మంది నెటిజన్లు అలాంటప్పుడు మీ సినిమాలలో ఎందుకు ఇంగ్లీష్ సాంగ్స్ ఉండేవి అంటూ కొంతమంది ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిజంగా తెలుగు భాష మీద మీకు అంత ప్రేమ ఉంటే పేదవారికి ఇంగ్లీష్ విద్య ఉచితంగా తీసుకు వస్తున్న సమయంలో ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంతకుముందే తెలుగు భాష కోసం పాటు పడాల్సింది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: