ప్రతి హీరోకు కొన్ని ఏరియాల్లో మార్కెట్ బలంగా ఉంటే కొన్ని ఏరియాల్లో మార్కెట్ బలహీనంగా ఉండటం కామన్ అనే విషయం తెలిసిందే. దీనికి ఏ హీరో అతీతుడు కాదు. తెలుగు రాష్ట్రాల్లోని ఏ సెంటర్లలో, ఓవర్సీస్ లో మహేశ్ బాబుకు బలమైన మార్కెట్ ఉంది. చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీయార్ కు సీడెడ్ ఏరియాలో బలమైన మార్కెట్ ఉంది. వైజాగ్ ఏరియాలో అల్లు అర్జున్ కు బలమైన మార్కెట్ ఉంది. 
 
కొందరు హీరోలు ఏ సెంటర్లలో స్ట్రాంగ్ గా బీ, సీ సెంటర్లలో వీక్ గా ఉంటారు. కొందరు హీరోల సినిమాలు బీ, సీ సెంటర్లలో కలెక్షన్లు సాధిస్తే ఏ సెంటర్లలో మాత్రం ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఓవర్సీస్ లో మాస్ సినిమాలకు సాధారణంగా ఆదరణ తక్కువగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన కలెక్షన్లను సాధిస్తాయి కానీ ఓవర్సీస్ లో మాత్రం హిట్ టాక్ వచ్చిన సినిమాలు కూడా దారుణమైన కలెక్షన్లు తెచ్చుకున్నాయి. 
 
బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కిన గౌతమీపుత్రశాతకర్ణి మాత్రమే ఓవర్సీస్ లో మిలియన్ డాలర్ కలెక్షన్లు సాధించింది. బాలకృష్ణ నటించిన మిగతా సినిమాలు మాత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. బాలకృష్ణ చివరగా నటించిన ఎన్టీయార్ కథానాయకుడు, ఎన్టీయార్ మహానాయకుడు సినిమాలు ఓవర్సీస్ లో డిజాస్టర్ అనిపించుకున్నాయి. 
 
ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమా కూడా రొటీన్ మాస్ మసాలా చిత్రం అన్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ ప్రేక్షకుల్లో రూలర్ సినిమా పట్ల ఏ మాత్రం ఆసక్తి లేదని తెలుస్తోంది. రూలర్ సినిమాను ఒక సంస్థ నుండి అడ్వాన్స్ కూడా తీసుకోకుండా సినిమాను అప్పగించి రిలీజ్ చేయిస్తున్నారని సమాచారం. ఓవర్సీస్ మార్కెట్ లో బాలయ్య మార్కెట్ ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రూలర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: