హైదరాబాద్ వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన యావద్దేశాన్ని కలచివేసింది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ అందరూ "నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఇలాంటి సంఘటనలు ఇంకోసారి జరగకుండా చూడాలని" ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఈ అంశంపై తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఎవరైనా సెలబ్రిటీలు కనుక అటూ ఇటూ మాట్లాడితే చాలు నెటిజన్లు వాళ్ళకి సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే 'సామజవరగమన' ట్వీట్ కు అల్లు అర్జున్ కు హీట్ తగిలింది. తాజాగా దర్శకుడి సందీప్ రెడ్డి వంగాకు కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

 

సందీప్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా "భయం అనేది కొత్త రూల్ గా ఉండాలి. భయం అనేది ఉంటేనే మన సమాజంలోని పరిస్థితుల్లో మార్పు వస్తుంది. క్రూరమైన శిక్షలు వేస్తేనే దారికి వస్తారు. ఈ దేశంలోని ప్రతి ఒక్క అమ్మాయికి ఓ గ్యారెంటీ కావాలి.  వరంగల్ పోలీసులను రంగంలోకి దిగవలసిందిగా నేను కోరుతున్నాను" అంటూ తన స్పందన తెలిపాడు. అయితే ఊహించని కోణంలో సందీప్ ట్వీట్ కు విమర్శలు వచ్చి పడ్డాయి.

 

అర్జున్ రెడ్డి.. కబీర్ సింగ్ లాంటి సినిమాలు తీస్తూ ఇప్పుడేమో 'భయం' గురించి చెప్తున్నావు.  ఇది సరి కాదు. అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీసి పురుషాధిక్య భావనలు పెరిగేలా చేస్తావు.. ఇప్పుడేమో రూల్స్ గురించి క్లాసులు ఇస్తావు. ఇదంతా హిపోక్రసీ. అమ్మాయి నచ్చితే ఆమె అనుమతి లేకపోయినా ముద్దుపెట్టుకోవచ్చు.. ఒళ్ళో పడుకోవచ్చు.. డ్రెస్ తీయమని కత్తితో బెదిరించొచ్చు.. నాకోరిక తీర్చు.. ప్రేమ అని మాట్లాడకు..లాంటి సైకో ఆలోచనలతో సినిమా తీసిన మీరు కూడా నీతులు చెప్తే ఎలా..? మెచ్యూరిటీ ఉన్నోడు అది సినిమా అనుకుంటాడు.. యువత అదే ఫాషన్ అనుకుంటోంది... ఇలా ఇంకా చాలామంది సందీప్ పై ఘాటుగా విమర్శలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఈ లెక్కన కొద్దిరోజులు అర్జున్ రెడ్డి/కబీర్ సింగ్ బ్యాచ్ మౌనంగా ఉండటమే బెటర్. సానుబూతి తెలిపారంటే తిక్క కుదురుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: