నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త, ఇద్దరు పిల్లలుండగా ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేమాయణం కొనసాగించింది. చివరకు విషయం బైటపడటంతో ప్రియుడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. 

 

ఇంతకీ వీరిద్దరి అక్రమ సంబంధం బయట పడేందుకు గల కారణం ఆమె కాల్ రికార్డింగులు. పిల్లలు పాటలు వినేందుకు ఫోన్ తీసుకుంటే మధ్యలో ఈ రికార్డింగులు ప్లే కావడంతో భర్త ఆక్రోషానికి అడ్దు లేకుండా పోయింది. ఇంకా ఆమె ఫోన్ ను తవ్వి చూస్తే కొన్ని ఫోటోలు కూడా దొరికాయి.

 

నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఇది. నెల్లూరు వైఎస్ఆర్ నగర్లో నివాసం ఉండే సలీం, పర్వీన్ భార్యా భర్తలు. పదేళ్లక్రితం వీరికి పెళ్లైంది, ఇద్దరు పిల్లలున్నారు. సలీం ఆటో మెకానిక్ కాగా, పర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల ఓ మహిళ ద్వారా పర్వీన్ ఫోన్ నెంబర్ షేక్ షుకూర్ అనే ఆటో డ్రైవర్ తీసుకున్నాడు. అప్పట్నుంచి వాట్సాప్, మెసేజ్ ల ద్వారా వీరిమధ్య ప్రేమాయణం నడిచింది. తరచూ ఒకరినొకరు కలుసునేవారు కూడా. ఈనేపథ్యంలో ఏకాంతంలో ఉండగా వీరిద్దరూ కలిసి చాలా సన్నిహితంగా సెల్ఫీలు కూడా తీసుకున్నారు.

 

అయితే ఆ ఫొటోలు భర్తకు దొరకడంతో ఇద్దరి వ్యవహారం బైటపడింది. మంగళవారం భార్య, ప్రియుడితో కలసి ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అయితే భర్తపై దాడి చేసి ప్రియుడు పరారయ్యాడు. స్నేహితుల సాయంతో అతడ్ని వెదికి పట్టుకుని తీసుకొచ్చిన భర్త, ఇద్దరికీ దేహశుద్ది చేశాడు. సొంత బిడ్డల ముందే వారి తల్లిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటే కొడుతుంటే చిన్న బిడ్డలు ఏడ్చిన ఏడుపులు చూస్తే ఎవరికైనా మనసు చలించిపోతుంది. 

 

ఇక పోతే ఆమె బంధువులు ఆ యువకుడిని ఇష్టం వచ్చినట్ళు చితకబాదగా.... ఆమె జుట్టు పట్టుకొని మొహం కనపడేలా ఫోన్ లో జరిగినదంతా ఆమె చేతనే చెప్పించి రికార్డింగు చేశారు చివరికి ఆ మెకానిక్ ప్రియుడిని పోలీసులు తీసుకెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: