రెగ్యులర్ గా తన సింగిల్ ఫొటో షూట్స్ తోనే మళ్ళీ ఏదో చేయాలని అనుకుంటున్నట్టుంది జెనీలియా డిసౌజా. జెనీలియా అంటే తెలుగు ప్రేక్షకులకు ఠక్కున గుర్తు రాకపోవచ్చు గాని కాస్త ఆలోచిస్తే మాత్రం గుర్తొచ్చేస్తుంది. దాదాపు పదేళ్ల కిందట జెనీలియా కెరీర్ తెలుగు ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లో మెరిసిన తర్వాత సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చాలా ఫేమస్ అయిపోయింది. మొదట్లో ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు మూటగట్టుకున్నప్పటికి ఆ తర్వాత జెనీలియా సినిమా ఇండస్ట్రీలో తిరుగు లేకుండా పోయింది. 

 

పెద్దగా ఎక్స్ పోజింగ్, అందాల ఆరబోత, లిప్ లాక్స్..వంటివి లేకుండానే కేవలం నటన, క్యూట్ నెస్ తోనే ఇండస్ట్రీ తో పాటు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది జెనీలియా. స్టార్ హీరోలతోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఒక బిగ్ షాట్ తనయుడితో ప్రేమను సాగించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ ముఖ్ ఇంటి కోడలయ్యింది. జెనీలియా కుటుంబ సభ్యులు రాజకీయంగా తమ ప్రస్థానాన్ని ఇప్పటికి కొనసాగిస్తూ ఉన్నారు.

 

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విలాస్ రావ్ తనయులు ఇద్దరు ఘన విజయాలు సాధించారు. ఇలా వీరి కుటుంబం రాజకీయంగా పట్టు నిలుపుకుంటూ ఉంది. మరోవైపు జెనీలియా భర్త ఇండస్ట్రీ లో మంచి హిట్స్ అందుకుంటూ మంచి ఫాం లో ఉన్నాడు. సోలో హీరోగా మాత్రం సక్సస్ ని అందుకోలేకపోతున్నాడు. ఇదిలా ఉంటే.. జెనీలియా రీ ఎంట్రీ కోసం జోరుగా ప్రయత్నాలు చేస్తోందని తాజా సమాచారం. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో పెళ్లైన హీరోయిన్లు రాణిస్తూ ఉన్నారు. ఐశ్వర్య, దీపికా, ప్రియాంక.. ఇలా పెళ్లైన వాళ్ళు కూడా హీరోయిన్స్ గా సక్సస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. వాళ్ళని చూసే జెనీలియా కూడా లేటెస్ట్ ఫొటో షూట్స్ తో సోషల్ మీడియాలో నెటిజన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం ఇలాంటి ఫొటో షూట్స్ మీకు అవసరమా అంటు కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: