సినిమా ఇండస్ట్రీ లో  కాంట్రవర్సీ  లేకుండా అన్ని వర్గాల  ప్రేక్షకులను మెప్పించే  హీరోలను వేళ్ళ మీదనే  లెక్కపెట్టవచ్చు.   ఒక్కసారిగా స్టార్ హోదా వస్తే  సడన్ గా  వాళ్ళ  ప్రవర్తించే తీరు మారిపోతుంది.  స్టార్  హోదా వచ్చే  ముందు  ఎలా వున్నారో  వచ్చాక  కూడా అలాగే ఉండడం  చాలా కష్టమైన పనే.  కానీ ఎప్పుడు  ఒకేలా వుంటూ  ఇండస్ట్రీ కి వచ్చి 40సంవత్సరాలకు పైనే  అవుతున్న  ఎలాంటి  వివాదాలు లేకుండా , జీరో హేటర్స్ తో  ఇంకా సూపర్ స్టార్ గా కొనసాగుతూ  ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్.  ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి వుండే నైజం  రజినీ సొంతం. అందుకే  ఆయన సూపర్ స్టార్ అయ్యాడు.
 
 
తాజాగా  రజినీ సింపుల్ సిటీ ఎలా ఉంటుందో  మరో సారి బయటపడింది. రెండు చేతులు లేని  ఓ అభిమాని తలైవా ను  కలువడానికి అతని ఇంటికి  వచ్చాడు.  రజినీ ఆ  అభిమానికి స్వాగతం పలికి  అతనికి చేతులు లేకపోకడంతో  అతని కాలుతో  తన చేతిని  కలిపి కరచాలనం చేశాడు. ఆ తరువాత  ఆ అభిమాని తో ముచ్చటించిన  రజినీ అతను  వద్ద నుండి తన ఫోటోను బహుమానం గా  పొందాడు.     సోషల్ మీడియా లో  ఆఫోటోలు  సర్కిల్ అవుతుండడం తో నెటిజన్లు  వాటిపై  స్పందిస్తూ  రియల్ సూపర్ స్టార్ అంటూ  కామెంట్లు చేస్తున్నారు. 
 
 
ఇక  రజినీ ఇటీవల ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్  లో నటించాడు. ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు  జరుపుకుంటున్న ఈచిత్రం  వచ్చే ఏడాది పొంగల్ కు విడుదలకానుంది. ఇకప్రస్తుతం రజినీకాంత్ తన 168 వ చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. మాస్ చిత్రాల డైరెక్టర్ శివ  తెరకెక్కించనున్న ఈ చిత్రం    త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: