నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత తీస్తున్న సినిమా ఇది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా బాలయ్య ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ దర్శకులు కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. 

                    

సినిమా బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో నటించినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సోనాల్ చౌహన్, వేదిక కథనాయకాలుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ రూలర్  చిత్రం తర్వాత బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

                     

అయితే ఇప్పటికే బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సింహ, లెజెండ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు తీయగా ఆ సినిమాల తర్వాత భారీ అంచనాల మధ్య మరో సినిమా రూపొందుతుంది. అయితే ఈ సినిమాలో రోజా కూడా విలన్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో రోజాతో పాటు జబర్దస్త్ షో యాంకర్ అనుసయా కూడా ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. 

                  

అంతేకాదు.. ఈ సినిమాలో కామెడీ పూయించడానికి జబర్దస్త్ షో లో పాపులర్ కమెడియన్స్ తీసుకోనున్నట్టు సమాచారం. కాగా ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిచనున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది. అనంతరం ఈ సినిమా ఏప్రిల్ నెలలో సమ్మర్ స్పెషల్ గా విడుదల కానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: