‘వెంకీమామ’ చిత్రంలో నటిస్తున్న వెంకటేశ్, నాగచైతన్య రియల్‌ లైఫ్‌లో  కూడా మామా అల్లుళ్లు అయిన హీరోలు,అలాగేయ్ ఈ చిత్రంలో   రీల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లుగా నటిస్తున్నరు .ఈ చిత్రానికి  కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికలుగా రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తున్నారు .

 

ఈ  చిత్రాన్ని సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ సురేశ్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై   నిర్మిస్తున్నారు. దగ్గుపాటి, అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ క్రేజీ మల్టీస్టారర్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.  డిసెంబ‌ర్ 13న‌  వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాగాచిత్ర యూనిట్ ,అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను విడుద‌ల చేసింది.

 

మొదట్లో నిజానికి ‘వెంకీమామ’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్టు  వార్తలు వచ్చాయి. కానీ, ఆ సమయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలు వస్తుండటంతో విడుదల వాయిదా పడుతుందని అన్నారు. అయితే,ఈ  సినిమా చిత్ర బృందం  అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తుంది. 

 

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో ‘వెంకీ మామ’ విడుదల తేది గురించి తెగ చర్చ జరిగింది. దీన్నే చిత్ర బృందం సినిమా విడుదల తేది కోసం ఉపయోగించుకుంది. సినిమా విడుద‌ల తేదీని అనౌన్స్ చేస్తూ ఓ ఫ‌న్నీ వీడియోను  హీరో రానా ద‌గ్గుబాటి, డైరెక్ట‌ర్ బాబీ  విడుద‌ల చేశారు.సోషల్‌ మీడియాలో  ‘వెంకీ మామ’పై  వస్తున్న ప్రశ్నలను చూసిన రానా.. నేరుగా దర్శకుడు బాబీ దగ్గరకు వెళ్లి అడుగుతాడు. సినిమా విడుదల తేది ఎప్పుడో కనీసం తనకైనా చెవిలో చెప్పమంటాడు. రానా చెవిలో బాబీ డిసెంబర్‌ 13 అని  విడుదల తేది గురించి  చెబుతాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: