అక్కినేని నాగచైతన్య కెరీర్ ప్రారంభం నుండి నిదానంగా ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ ఫ్లాప్స్ తో చైతూ కెరీర్ లో ముందుకు సాగుతున్నాడు. సక్సెస్ వచ్చిన వెంటనే ఫ్లాప్ పడుతూనే ఉన్న కారణంగా చైతూ రెమ్యూనరేషన్ పెంచలేక పోతున్నాడు. మిగతా యంగ్ హీరోలతో పోల్చితే చాలా బెటర్ గానే ఉన్న చైతూ ఇంకా తన రెమ్యూనరేషన్ ను పెంచే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా తాజా సమాచారం. మజిలీ సినిమాతో మంచి సక్సెస్ ను దక్కించుకున్న చైతూ ప్రస్తుతం వెంకీ మామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

 

వెంకీ మామ సినిమా ఈ నెలాఖరున విడుదల కాబోతుండగా.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా వీలైంత త్వరగా కంప్లీట్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాలపై కూడా చైతూ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ రెండు సక్సెస్ లు అయితే హ్యాట్రిక్ కొట్టానంటూ చైతూ రెమ్యూనరేషన్ పెంచే ఉద్దేశ్యంలో ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారం. అందుకే కొత్త ప్రాజెక్ట్ లు ఏవీ ఓకే చేయడం లేదని.. నిర్మాతలను హోల్డ్ లో ఉంచినట్లుగా లేటెస్ట్ న్యూస్.

 

ఇప్పటికే చైతూ ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు డేట్లు ఇచ్చాడు. కాని ఆ నిర్మాతలతో రెమ్యూనరేషన్ సంబంధించి మాత్రం కమిటవలేదని.. ఆ సినిమాల విడుదల తర్వాత రెమ్యూనరేషన్ ని కోటి లేదా కోటిన్నర వరకు పెంచాలని చైతూ ప్లాన్ లో ఉన్నాడట. ఇప్పటి వరకు మీడియం రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకున్న చైతూ ఇప్పుడు సడన్ గా రెమ్యూనరేషన్ పెంచితే నిర్మాతలకు భారం అవుతాడేమో అంటూ ఇండస్ట్రీలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చైతూ ఈ రెండు సినిమాల సక్సెస్ తో మార్కెట్ కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చైతూతో సినిమా నిర్మించే నిర్మాతలకు వచ్చే నష్టం ఏమీ ఉండదని మాత్రం సినీ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: