మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. ప్రేక్షకుల్లో చిరంజీవి చేసే మెస్మరైజింగ్ డ్యాన్సులు ఎలా ఉంటాయో, ఎంటర్ టైన్మెంట్ ఎలా ఉంటుందో అనే క్రేజ్ ఏర్పడుతుంది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ సినిమా చేస్తున్నాడు మెగాస్టార్. ఈసారి తన మార్కు డ్యాన్సులు, కామెడీని మిస్సవ్వకూడదని ఫిక్సయ్యాడట చిరంజీవి. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మను దింపాడు మెగాస్టార్. సైరాలో మిస్సైన కంటెంట్లను ఈ సినిమాలో చూపాలని నిర్ణయించుకున్నాడట.

 

 

ఇటు మణిశర్మకు కూడా దాదాపు 14ఏళ్ల తర్వాత మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. మెగాస్టార్ కు తాను మ్యూజిక్ ఇస్తే ఏ స్థాయిలో ఉంటుందో మరోసారి తెలుగు ప్రేక్షకులకు రుచి చూపాలని అనుకుంటున్నాడట మణిశర్మ. ప్రస్తుతం ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం బ్యాంకాక్ వెళ్లాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఎలాగైనా చిరంజీవి స్థాయి మ్యూజిక్ ఇవ్వాలని మణి ప్రయత్నిస్తున్నాడట. ఎన్నో మ్యూజికల్ హిట్స్ వీరిద్దరి కాంబోలో ఉన్నాయి. మృగరాజు లాంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమాలో కూడా మణి మ్యూజిక మ్యాజిక్ ఏమాత్రం మిస్ కాలేదు. ఇక మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ ఎలివేషన్ సంగతి ప్రత్యేకంగా చెప్పే అవసరమే లేదు.

 

 

మరి చాన్నాళ్ల తర్వాత దొరికిన ఈ మెగా అవకాశాన్ని మణిశర్మ ఎలా సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి. సైరాలో చిరంజీవి మార్కు పాటలు, కామెడీ, డ్యాన్సులు లేకపోయినా తెలుగులోనే 100కోట్ల మైలు రాయి దాటిందంటే చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోయిన్ గా త్రిష నటిస్తోందని సమాచారం. వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదల కానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: