దేశవ్యాప్తంగా దిశ దారుణ హత్య ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా నిందితులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి మాధవీలత దిశ హత్యాచారం ఘటన గురించి ఒక టీవీ ఛానల్ డిస్కషన్ లో పాల్గొన్నారు. దిశ దారుణ హత్య కేసు ఘటనలో సోషల్ మీడియాలో సీఎం కేసీఆర్ ను ప్రశ్నించానని కానీ కేసీఆర్ ను ప్రశ్నించినందుకు తనకు వింత అనుభవం ఎదురైందని మాధవీలత చెప్పారు. 
 
మొదటిసారి రేపిస్టులు ఎలా ఉంటారో కళ్లారా చూశానని నెటిజన్ కామెంట్ చాలా బాధించిందని మాధవీలత చెప్పుకొచ్చారు. ఫేస్ బుక్ లో సీఎం కేసీఆర్ ను దిశ ఘటనలో తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘోరాలు జరుగుతూ ఉంటే సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించానని నిందితులను ఎందుకు పట్టుకోవడం లేదని పట్టుకున్నా శిక్షలు వేయరా..? అని ప్రశ్నించానని అన్నారు. బయటివాళ్లు మీకు ఆడపిల్లల్లా కనిపించండం లేదా..? ఏం జరుగుతుంది రాష్ట్రంలో..? అని ప్రశ్నించానని చెప్పారు. నిందితులను పోలీసులు పట్టుకోకముందు మాధవీలత ఈ పోస్ట్ చేశారు. 
 
ఆ పోస్ట్ గురించి చాలా మంది కామెంట్లు చేశారని ఒక నెటిజన్ మాత్రం చాలా దారుణంగా కామెంట్ పెట్టాడని మాధవీలత చెప్పారు. "ఏంటే నీ గోల నీలాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు" అని కామెంట్ పెట్టాడని మాధవీలత చెప్పారు. ఆ వ్యక్తికి ఫేస్ బుక్ లో " రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటానని పేపర్లలో చదివాను టీవీలలో చూశాను... రేపిస్టులు అంటే నీలా ఉంటారని ఫస్ట్ టైమ్ ఫేస్ బుక్ లో చూశాను. నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత గొప్పగా పెంచారో... నీ సంస్కారం ఏమిటో నీ కామెంట్ చూస్తే అర్థమవుతుంది" అని సమాధానం ఇచ్చానని మాధవీలత చెప్పారు. ఆడవారికి ఇలాంటి వ్యక్తుల వలనే రక్షణ లేకుండా పోయిందని ఫేస్ బుక్ లో కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి మాధవీలత అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: