గత కొంత కాలంగా తెలుగు సినిమాల్లో ప్రాంతీయ భాషల్లో హీరో లేదా హీరోయిన్స్ చేత మాట్లాడిస్తున్నారు. ఇది బాగా ఆకట్టుకుంటుంది కూడా. ముఖ్యంగా మన తెలుగు సినిమాలలో ఎప్పుడు భాష-యాస హాట్ టాపిక్. సినిమా మొదలైనపుడే ఈ సినిమాలో హీరో ఈ యాసలో డైలాగ్స్ చెపాడు అని డైరెక్టర్ ఇలా చెప్తాడో లేదో ఇక ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు తమ హీరో చెప్పే డైలాగ్స్ ని స్క్రీన్ మీద చూద్దామా అని ఆతృతగా ఉంటారు. నైజం యాస.. చిత్తూరు యాస.. శీకాకుళం యాస.. రాయలసీమ యాస.. గుంటూరు యాస .. అంటూ రకరకాల యాసల్ని ఇప్పటికే మన దర్శకులు పరిచయం చేశారు. భాషలోని మాధుర్యాన్ని తెలుగు దనాన్ని.. కల్చర్ ని ఎంతో అందంగా ఎలివేట్ చేశారు. ఇక ఇలాంటి విషయాల్లో శేఖర్ కమ్ముల కున్న టాలెంట్ ని 'హ్యాపీడేస్' సినిమా నుంచి చూస్తున్నాము. ఒక్క 'హ్యాపీడేస్' సినిమాలోనే నైజాం యాస.. హైదరాబాదీ యాస.. శ్రీకాకుళం యాస.. అన్నిటినీ చూపించారు. ఇక రీసెంట్‌గా 'ఫిదా' సినిమాలో సాయి పల్లవి నైజాం యాస తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. 

 

ఇప్పుడు మరోసారి అలాంటి ఎక్‌పరిమెంట్ చేస్తున్నాడు కమ్ముల. ఈసారి కూడా నైజాం యాసను హైదరాబాదీ లోకల్ యాసను కూడా తన సినిమాలో హైలైట్ చేస్తున్నాడు. అయితే ఈసారి అక్కినేని హీరో నాగచైతన్యకు ఇది సవాల్ లాంటిది. ఈ సినిమాలో చైతూ సరసన నటిస్తున్న సాయి పల్లవికి నైజాం యాస యాప్ట్ అని ప్రూవైంది. తన బాడీ లాంగ్వేజ్ కి సాయి పల్లవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే భాష యాస కుదిరాయి. ఇప్పుడు చైతూకి హైదరాబాదీ లోకల్ యాస.. నైజాం మాస్ స్లాంగ్ ని అలవాటు చేసేందుకు బాగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారట. పెర్ఫామెన్స్ లో డ్యాన్సుల్లో యాసలో ఇలా అన్ని కోణాల్లో సాయి పల్లవి ఏ హీరోకైనా ఠఫ్ కాంపిటీషన్ ఇస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే ఈ విషయంలో చైతూ చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. 

 

ఇంకా చెప్పాలంటే కమ్ముల మార్క్ హీరోలా కనిపిస్తాడట. ఇక ఈ సినిమాలో చైతన్య పూర్తిగా నైజాం రూరల్ కుర్రాడి గా కనిపిస్తుండడం విశేషం. హైదరాబాదీ యాసకు రూరల్ యాసకు మాధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అసలు ఆ రెండిటికి పోలికే ఉండదు. తెలంగాణ పల్లెల్లో పక్కా ఊర మాస్ యాటిట్యూడ్ తో చాలా ఫన్ జనరేటవుతుంది. అయితే దానిని చైతూ ఎంత ఛాలెంజింగ్ గా పోషించనున్నాడు? అన్నది చూడాలి. అయితే చాలామంది సాయి పల్లవితో పోటీనా చైతూ కి అంత సీనుందా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: