భారతదేశం సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన చంద్రయాన్-2 అనుకున్న రీతిలో విజయం సాధించకపోయినా ప్రపంచవ్యాప్తంగా మన సైంటిస్టులు చేసిన పనికి ఎన్నో ప్రశంసలు అందుకుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో అర్ధాంతరంగా మన స్పేస్ స్టేషన్ నుండి సిగ్నల్ కట్ కావడంతో చంద్రయాన్-2 కథ ఇక్కడే ముగిసిపోయింది అనుకున్నారు. అయితే ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్. చందమామ దక్షిణ తీరంలో పడిపోయినా ఇస్రా విక్రమ్ లాండర్ ఎక్కడుందో అమెరికాకు చెందిన నాసా కనిపెట్టేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా బయటకు విడుదల చేసింది.

 

చంద్రయాన్-2 లో అతి ముఖ్యమైన మరియు ప్రభావవంతమైన విక్రమ్ ల్యాండర్ నుండి సిగ్నల్ కట్ అయిపోయిన తర్వాత చందమామ దక్షిణ ధ్రువం లో పడిపోయింది అన్న విషయం తెలుసు కానీ చందమామ పై ఉన్న చీకటి వల్ల ఇన్ని రోజులు అది ఎక్కడికి పోయిందో కనిపెట్టలేకపోయారు.

 

ఐతే... అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసా... తాజాగా ఇస్రో విక్రమ్ ల్యాండర్‌ను చందమామపై కనిపెట్టింది. అందుకు సంబంధించిన ఫొటోల్ని షేర్ చేసింది. సెప్టెంబర్ 26న ఏ ప్రదేశంలో పడిందో గుర్తించింది. షణ్ముగ సుబ్రహ్మణ్యన్ అనే వ్యక్తి... LRO ప్రాజెక్టు సభ్యుల్ని కాంటాక్ట్ అయ్యారు. ఆయన తొలిసారిగా విక్రమ్ ల్యాండర్‌కి సంబంధించి ఓ విడి భాగాన్ని అది పడిన ప్రదేశానికి 750 మీటర్ల దూరంలో గుర్తించారు. తద్వారా విక్రమ్ ల్యాండర్ ఎక్కడ పడిందీ తెలిసింది.

 

ఇకపోతే కూలిన ల్యాండర్ నుండి కొన్ని శకలాలు చిందరవందరగా పడినట్లు తెలిపిన నాసా మొత్తం 24 చోట్ల ఈ శకలాలను ఉన్నట్లు గుర్తించారు. మొత్తం మీద కొన్ని కిలోమీటర్ల ప్రాంతంలో ఇవి చెల్లాచెదురుగా పడి ఉండగా ఒకవేళ విక్రమ్ ల్యాండర్ కనుక అనుకున్న యాంగిల్ లో చంద్రుడు పైన పడి ఉంటే దానిని ఎందుకైతే చంద్రుడిపైకి పంపించారో ఆ పనిని ఇప్పటికీ అది కరెక్ట్ గా చేస్తూ ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.


ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ల్యాండర్ నుండి విడిపోయిన భాగాలను మినహాయిస్తే ల్యాండర్ కు అనుసంధానం అయి ఉన్న వాటి ద్వారా అది ఇప్పటికే సమాచారాన్ని సేకరిస్తూ ఉండేందుకు అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మన శాస్త్రవేత్తలు శ్రమ వృధా పోలేదు అనే చెప్పాలి. జులైలో ఇస్రో... చంద్రయాన్ 2 ప్రయోగాన్ని చేపట్టింది. అమెరికా, రష్యా, చైనా, తర్వాత చంద్రుడిపై ల్యాండర్‌ను దింపిన దేశం భారతే. అంతేకాదు... చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ల్యాండర్‌ను పంపిన తొలి దేశం భారతే. ప్రస్తుతం చంద్రయాన్ 2లో కీలకమైన ఆర్బిటర్... చందమామ చుట్టూ బ్రహ్మాండంగా తిరుగుతోంది. విక్రమ్ ల్యాండర్ అందులోని ప్రజ్ఞాన్ రోవర్ మాత్రం పనిచెయ్యట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: