ఈనెల 20న విడుదల కాబోతున్న బాలకృష్ణ ‘రూలర్’ మూవీకి సంబంధించి ఈ మూవీ నిర్మాతలు బయ్యర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా బాలకృష్ణ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ లో పెద్దగా క్రేజ్ ఉండదు. 

దీనికితోడు ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ తరువాత బాలయ్య మార్కెట్ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడ విపరీతంగా పడిపోయింది. దీనితో మొదట్లో ‘రూలర్’ మూవీని 4 కోట్లకు కొంటాను అని మాట ఇచ్చిన ఒక ఓవర్సీస్ బయ్యర్ ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడంతో ఈ మూవీ నిర్మాతలు బాలకృష్ణ సలహాతో ఓవర్సీస్ బయ్యర్లకు బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమాచారం. 

సినిమా ఓవర్సీస్ రైట్స్ ఎటువంటి డబ్బు ఇవ్వకుండా ఇస్తామని కమీషన్ బేస్ మీద ఈ మూవీని ఓవర్సీస్ లో విడుదల చేయమని ఈ మూవీ నిర్మాతలు కొందరు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. సాధారణంగా ఇలాంటి ఆఫర్లు చిన్న సినిమాలకు ఇస్తూ ఉంటారు. 

అయితే బాలయ్య లాంటి టాప్ హీరో సినిమాకు ఇలా ఫ్రీ ఆఫర్స్ ఇచ్చినట్లుగా వార్తలు రావడం బట్టి ప్రస్తుతం బాలయ్య మార్కెట్ ఏ విధంగా పడిపోయిందో అర్ధం అవుతుంది. మన తెలుగు రాష్ట్రాలలో కూడ కొన్ని ఏరియాలలో ‘రూలర్’ కు బిజినెస్ పరంగా ఎదురీత వచ్చిన నేపధ్యంలో ఈ మూవీ నిర్మాత తానే కొన్ని ఏరియాలలో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇటీవల ‘రూలర్’ సినిమా నుంచి ''అడుగడుగో యాక్షన్ హీరో'' అంటూ సాగే పాటకు స్పందన బాగానే వచ్చింది. ముఖ్యంగా లుక్స్ పరంగా ఈ మూవీలో బాలయ్య చాల డిఫరెంట్ గా కనిపిస్తున్న నేపధ్యంలో ఈ మూవీ కథలో ఏమాత్రం వెరైటీ కనిపించినా తిరిగి బాలయ్య మ్యానియా ప్రారంభం అయ్యే ఆస్కారం కనిపిస్తోంది. అయితే ఈ మూవీకి పోటీగా సాయి ధరమ్ తేజ్ ‘ప్రతిరోజు పండగే’ సల్మాన్ ఖాన్ ‘దబాంగ్ 3’ విడుదల అవుతున్న పరిస్థితులలో బాలయ్య మూవీ కొంత వరకు కార్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్న మాటలు వినిపిస్తున్నాయి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: