రెండు దశాబ్దాల క్రితం అంజలా జవేరీ అంటే కుర్రకారుకు అదో రకమైన  మోజు. ప్రేమించుకుందాం రా అంటూ వెండి తెర నుంచే పిలుస్తూంటే యువ హ్రుదయాలు ఎన్ని అల్లాడిపోయాయో. హార్ట్ బీట్ ఎంత వేగంగా కొట్టుకుందో కోట్లాది గుండెలకే తెలుసు. వరసగా తెలుగులో టాప్ హీరోల పక్కన నటించిన అంజలా జవేరీ ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ గా రేసులోకి దూసుకు వచ్చింది.

 

సమరసింహారెడ్డి మూవీలో అన్ని పాటలూ ఒక ఎత్తు. అందాల ఆడబొమ్మ అంటూ ఇంటర్వెల్ తరువాత వచ్చే మెలోడీ  సాంగ్ మ‌రో ఎత్తు. పక్కా మాస్ హీరోగా ఉన్న బాలక్రిష్ణ చేత జస్ట్  మూమెంట్స్ చేయిస్తూ పక్కన మెరుపుతీగ అంజలా జవేరీతో కన్నుల పంట పండించారు డైరెక్టర్ బీ గోపాల్.

 


ఇక రావోయి చందమామ మూవీ విషయం తీసుకున్నా చిత్రం ఫెయిల్ అయింది కానీ అందులో అంజలా జవేరీ  అందాలు అదుర్స్ అన్నట్లుగా ఉంటాయి. ఆమె నాగ్ జోడీగా సాంగ్స్, సీన్లు చాలా బ్యూటీఫుల్ అనాల్సిందే. చిరంజీవితో చూడాలని ఉంది మూవీలో అంజలా జవేరీ  జత కట్టి మెగాభిమానులకు ఇష్ట దేవత అయింది.

 

ఇలా అంజలా జవేరీ టాలీఅవుడ్ ని ఏలుతూనే బాలీవుడ్  లోనూ చాలా మూవీస్ చేసింది. 2012లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మూవీలో మాయ పాత్రలో  నటించిన తరువాత ఆమె హఠాత్తుగా మాయమైంది. కట్ చేస్తే టాప్ మోడల్ గా అప్పట్లో ఉన్న తరుణ్ అరోరాను పెళ్ళాడి పూర్తిగా వెండి తెరకు దూరమైంది.

 

ఇది జరిగి ఎనిమిదేళ్ళు కావస్తోంది. తన కాపురం సవ్యంగా సాగుతోంది. అయితే అంజలా జవేరీ  మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు ఆమె భర్త తరుణ్ అరోరా. గ్లామర్ రోల్స్ ఆమె వేయాలనుకోవడం లేదు, మంచి పాత్ర వస్తే కనుక చేసేందుకు రెడీ అంటూ భర్త గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఇక అంజాలా జవేరీ ఎంట్రీకి  ముహూర్తం కుదిరినట్లే. మరి ఆమె ఏ మూవీతో రీ ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: