రానాకు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో కొన్ని నెలలుగా రానా సినిమాలు అన్నీ ఆగిపోయాయి. రానా పూర్తి ఆరోగ్యంతో అమెరికా నుండి తిరిగి రావడంతో ఇప్పుడు మళ్ళీ రానా తన సినిమాల షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నాడు.

అయితే ఇన్ని నెలల తరువాత రానా పై వచ్చిన రకరకాల రూమర్స్ విన్న తరువాత కెమెరా ముందు రానా నటన ఎలా ఉండబోతోంది అని ఆసక్తి కనపరుస్తున్న వారికి రానా ‘వెంకీ మామ’ ను బాగా ఉపయోగించుకున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అంటూ రానా దర్శకుడు బాబిని అడుగుతున్నట్లుగా ఒక ధియేటర్ లో వీరిద్దరి పై చిత్రీకరించిన వీడియోలో రానా తల పై హ్యాట్ పెట్టుకుని చాల ఉత్సాహంగా కనిపించాడు.

తన చిన్నాన్న సినిమా గురించి తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ రానా తన సహజ సిద్ధమైన నటనతో ఈ వీడియోలో నటించడం చూసిన వారికి రానాలో ఏమార్పు లేదు అన్నది స్పష్టంగా కనిపించింది. ‘వెంకీ మామ’ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసే వీడియోలో రానా ను చూసిన అతడి అభిమానులు అతడి లుక్ ను చూసి జోష్ లోకి వెళ్ళిపోతున్నారు.

ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడ్డ ‘వెంకీ మామ’ డిసెంబర్ 13న విడుదల అవుతోంది. దీనితో ఒకే సంవత్సరంలో తన రెండు సినిమాలను విడుదల చేసి వెంకటేష్ తీస్తున్న పరుగులు చూసిన వారికి వెంకీ స్పీడ్ టాప్ యంగ్ హీరోలకు కూడ షాక్ ఇస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ పుట్టినరోజు సెంటిమెంట్ తో విడుదల అవుతున్న ఈ మూవీ కూడ అనుకున్న స్థాయిలో విజయవంతం అయితే వెంకటేష్ మార్కెట్ మరింత పెరగడమే కాకుండా టాప్ హీరోలతో సమానంగా అతడి పారితోషికం కూడ భారీగా పెరిగే ఆస్కారం ఉంది. మరి ప్రేక్షకులు ఈ ‘వెంకీ మామ’ పై ఎటువంటి తీర్పు ఇస్తారో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: