పెళ్ళ‌య్యాక ఎవ్వ‌రైనా స‌రే వాళ్ళ బంధానికి గుర్తుగా ఒక ప్ర‌తిరూపం కావాల‌నుకుంటారు. కానీ వీళ్ళేంటో మ‌రి కొంచం విచిత్రంగా ఉన్నారు. అంజ‌లాజ‌వేరి, త‌రుణ్ అరోరా వీళ్ల‌కు పిల్ల‌లు వ‌ద్దంట‌. ఇక సినిమా వాళ్ల విష‌యానికి వ‌స్తే వాళ్ల రుచులు, అభిరుచులు కొంచం భిన్నంగానే ఉంటాయి. అలాగే ఎప్పుడు క‌లిసుంటారో ఎప్పుడు విడిపోతారో ఎవ్వ‌రికీ అర్ధంకాదు. ఇక‌పోతో  మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో స్టైలిష్ విల‌న్‌గా తెలుగు తెరకు పరిచయమైన నటుడు త‌రుణ్ రాజ్ అరోరా. ఆ సినిమా త‌ర్వాత మ‌ళ్లీ ‘అర్జున్ సుర‌వ‌రం’లో ప్రతినాయ‌కుడిగా నటించారు. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల‌కి సుప‌రిచిత‌మైన అంజ‌లా జ‌వేరి భ‌ర్తే త‌రుణ్ అరోరా. ఆయన విలన్‌గా నటించిన ‘అర్జున్ సుర‌వ‌రం’ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో తరుణ్ మీడియాతో ముచ్చటించారు. సినిమాతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.

 


మోడ‌లింగ్ రంగంతో మొద‌లు పెట్టిన నా కెరియ‌ర్ సినిమాల వ‌ర‌కు వ‌చ్చింది. ప్ర‌తి సినిమాలోనూ ఒక కొత్త స్టైల్ లో క‌నిపిస్తాను. అది న‌ట‌న‌లోనూ క‌నిపించేలా చూసుకోవ‌డం నా బాధ్యత. ఆ ప్రయ‌త్నంలో సక్సెస్ అయ్యాననే సంతృప్తి ఉంటుంది. ‘అర్జున్ సురవరం’లో చాలా మంచి పాత్రలో నటించాను. త‌మిళ చిత్రం ‘కణిత‌న్‌’కి రీమేక్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త‌మిళ్‌లో కూడా నేనే న‌టించా. అక్కడ క‌థ ప్రధానంగా హీరో, విల‌న్‌ల మ‌ధ్యే సాగుతుంది. తెలుగులో మాత్రం ఇత‌ర పాత్రల‌కి కూడా ప్రాధాన్యం ద‌క్కింది. సెంటిమెంట్ కూడా తోడైంది. అది సినిమాకి మరింత మేలు చేసింది. చూసిన‌వాళ్లంతా బాగుంది అంటున్నారు.

 

 నేను అస్సోంలో పుట్టా. చ‌దువుల కోస‌మ‌ని చెన్నై వ‌చ్చా. బెంగుళూరులో మోడ‌ల్‌గా కొన‌సాగా. అలా అన్ని సౌత్ ఇండియా సిటీస్‌తో నాకు అనుబంధం ఉంది. నా భార్య అంజలా జవేరి న‌ట‌న గురించి నాకెప్పుడూ ఎలాంటి స‌ల‌హాలు ఇవ్వదు. నీకు న‌చ్చింది చేయ్ అంటుంది. నేను చేసిన సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అంజలా జవేరి నేను ముంబైలో ప్రేమలో పడ్డాం. నేను మోడలింగ్ చేసేవాడిని, ఆమె నటిగా ఉంది. ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ముందు నేనే ప్రేమ‌ని వ్యక్తం చేశా. అప్పుడు త‌ను ద‌క్షిణాదిలో సినిమాలు చేస్తుంది. ఒక ఈవెంట్‌లో క‌లుసుకున్నప్పుడు ఇద్దరికీ ప‌రిచ‌యం ఏర్పడింది. ఆ త‌ర్వాత కొన్నాళ్లు స్నేహితులుగా ఉన్నాం. అనంతరం ప్రేమ‌, పెళ్లి. మాకు పిల్లలు లేరు. పిల్లలు వద్దు అనునకున్నాం. మేమే ఒక‌రికొక‌రు పిల్లల్లా ఉంటాం అంటూ చెప్పారు అరోరా.

మరింత సమాచారం తెలుసుకోండి: