ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో ఒక హాట్ కపుల్ పై అనేక ఆసక్తికర గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి. ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు క్రేజ్ ఉన్న ఆ హాట్ కపుల్ తమ పని ఒత్తిడి నుంచి రిలాక్స్ కావడానికి ఎంచుకున్న మార్గం చాల మందికి షాక్ ఇస్తోంది. 

హడావిడి చేస్తున్న ఈ గాసిప్పుల ప్రకారం ఈ హాట్ కపుల్  విదేశాల్లో ఉన్న కేసినోవాలకు వెళ్ళడం అక్కడ సరదాగా జూదం ఆడటం ఒక అలవాటుగా మార్చుకున్నారట. అంతేకాదు ప్రపంచ దేశాలలోని కేసినోలు ఎక్కడ ఉంటే అక్కడికి వీరు వెళ్ళిపోతున్నారని అక్కడ కార్డ్ గేమ్స్ ఆడుతూ ఆటలో రిలాక్స్ అవుతున్నారని గాసిప్పులు గుప్పు మంటున్నాయి. 

అయితే ఇక్కడ కూడ వారికి అదృష్టం తలుపు తట్టడంతో ఇటీవల ఈ ఆటలో జాక్ పాట్ తగిలింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో మరింత రెచ్చి పోయి వీరు తరుచు ఈ కేసినోల వెంట పరుగులు పెడుతున్నట్లు వార్తలు గాసిప్పులు గా మారుతున్నాయి. ఈ గాసిప్పులు ఎంత వరకు నిజం అన్న విషయమై క్లారిటీ లేక పోయినా ఇలాంటి జాదాల పట్ల ఆ హాట్ కపుల్ ఎందుకు ఆకర్షించ బడుతున్నారు అంటూ కొందరు ఆశ్చర్య పడుతు వారి సన్నిహితులకు సలహాలు ఇవ్వడానికి కూడ సాహసించ లేక పోతున్నట్లు టాక్. 

ఇలాంటి కేసినోలు వ్యవహారంలో ఈ హాట్ కపుల్ జాగ్రత్తగా ఉంటే మంచిది అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. పరిస్థితులు సజావుగా జరుగుతున్నంత సేపు ఇలాంటివి సరదాగా కనిపిస్తాయని ఒకసారి ఈ సరదాలు చేయి దాటితే వాటి వల్ల కెరియర్ పాడై పోతుందని అంటూ ఈ హాట్ కపుల్ సరదాల పై మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాస్తవానికి వీరు ఎవరు అన్న విషయమై స్పష్టత లేకపోయినా వీరు ఇండస్ట్రీకి చెందిన ఒక హాట్ కపుల్ అని మాత్రం అని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: