బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అలియా భట్ మ్యానియా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆమె డేట్స్ కోసం అనేకమంది ప్రముఖ దర్శక నిర్మాతలు ఆమె చుట్టూ తిరుగుతూ ఆమె చెప్పే కండిషన్స్ ను ఒప్పుకోవడమే కాకుండా ఆమె కోరుకున్న భారీ పారితోషికాన్ని ఇస్తున్నారు. 

దర్శకుడు రాజమౌళి కూడ ఈమెను ‘ఆర్ ఆర్ ఆర్’ విషయంలో ఒప్పించడానికి గతంలోనే వార్తలు వచ్చాయి. అలాంటి అలియా భట్ కు కుటుంబ సమస్యలు ఉన్నాయి అన్న విషయం చాలామందికి తెలియదు. ఈ మధ్య ముంబాయిలో జరిగిన ఒక సమావేశంలో అలియా భట్ బహిరంగంగా కన్నీరు పెట్టుకోవడం జాతీయ మీడియాకు హాట్ న్యూస్ గా మారింది. 

అలియా భట్ కు షహీన్ అన్న సోదరి ఉంది. ఆమె కొంతకాలం క్రితం తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడంతో ఆమె గురించి అలియా భట్ విపరీతంగా టెన్షన్ పడిందట. ఆమె అనారోగ్యాన్ని బాగుచేసి ఆమె ఆరోగ్యాన్ని కుదుట పరచడానికి అలియా ఎంతోమంది డాక్టర్స్ సలహాలను తీసుకోవలసి వచ్చింది. షహీన్ తన డిప్రెషన్ నుండి కోలుకుని ‘ఐ హావ్ నెవర్ బీన్ హ్యాపియర్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాసింది. 

ఈ పుస్తక ఆవిష్కరణ సభ ముంబాయిలో మొన్న ఆదివారం జరిగింది. ఈ ఫంక్షన్ కు వచ్చిన అలియా భట్ తన సోదరి షహీన్ తన అనారోగ్యం నుండి తేరుకుని రచయిత్రిగా మారినందుకు ఆనంద పడుతూ ఆమెను కౌగలించుకుని ఉద్వేగపూరితంగా కన్నీరు పెట్టుకోవడం మీడియా కెమెరాలకు హాట్ న్యూస్ గా మారడంతో ఆమె కన్నీటి వ్యధను హైలెట్ చేస్తూ జాతీయ మీడియా నుండి లోకల్ మీడియా వరకు అనేక వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ ను ఫాలో అవుతున్న వారికి ఎన్నో గ్లామర్ పాత్రలను చేస్తూ ఎంతో హుషార్ గా కనిపించే అలియా భట్ కు ఇంత సున్నితమైన మనసు ఉందా అంటూ ఆశ్చర్య పోతున్నారు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: