తెలుగు సినిమా యంగ్‌ హీరో నాని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో `వి` సినిమా సెట్స్ మీద  ఉండగానే మరో సినిమాను ప్రకటించాడు నాని. తనకు నిన్ను కోరి లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాను  అందించిన శివా నిర్వాణ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడు. మంగళవారం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు.ఈ సినిమాకు టక్‌ జగదీష్‌ అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్‌.  

షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం  2020లో  రిలీజ్‌కు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వెల్లడించారు.   చిత్రయూనిట్ రెగ్యులర్‌ షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఈ సినిమాలో నానికి జోడిగా రీతూవర్మ నటించనుంది. మరో హీరోయిన్‌ను  ఐశ్వర్యా రాజేష్‌గా  ప్రకటించారు .  త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నాడు. 

సినిమా షూటింగ్‌ను ఇటీవల గ్రాండ్‌గా నిర్వహించాలని ప్లాన్‌ చేసినా  ఇటీవల జరిగిన దిశ హత్యోదతం నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఎలాంటి హడావిడి లేకుండా సినిమా టైటిల్‌ను ప్రకటించేశారు. ఈ  సినిమా ఆరుగురు అన్నదమ్ముల కథతో తెరకెక్కనుందన్న టాక్‌ వినిపిస్తోంది. సినిమాలో నాని నిక్‌ నేమ్‌ టక్‌ జగదీష్‌ అని అదే సినిమా టైటిల్‌ గా ఫిక్స్‌ చేశారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఇటీవల గ్యాంగ్‌ లీడర్‌ సినిమా తో పరవాలేదనిపించిన నాని, ప్రస్తుతం వి సినిమాలో సరికొత్తగా అలరించనున్నాడు. ఈ  సినిమాలో నాని తొలిసారిగా నెగెటివ్‌ రోల్‌లో కనిపిస్తున్నాడు. తనను హీరోగా పరిచయం చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని నటిస్తున్న హ్యాట్రిక్‌ సినిమా కావటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. సుధీర్‌ బాబు హీరో గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్‌, అదితి రావ్‌ హైదరీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: