తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన నాని, వరుస సినిమాలలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. దాదాపుగా 26 చిత్రాల్లో నటించిన నాని ప్రస్తుతం మరో రెండు భారీ ప్రాజెక్టులలో నటిస్తూ వస్తున్నారు.  గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ ఇవ్వడంతో నానితో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. చాలా కథలను నాని వినకుండానే రిజెజెక్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

 

అసలు విషయానికొస్తే నాని ప్రస్తుతం రెండు సినిమాలో నటిస్తున్నారు. ఎప్పుడు కూల్ లవర్ బాయ్ లాగ కనిపించే నాని మొదటిసారి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం 'వి'. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నివేదా థామస్, నాభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా పూర్తి కావోస్తుండటంతో మరో సినిమాను లైన్లో పెట్టారు. 

 

ఇది ఇలా ఉండగా న్యాచురల్ స్టార్ నాని , శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. వీరిద్దరి కాబినేషన్లో తెరకెక్కుతున్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా నిన్ను కోరి హిట్ కావడంతో రెండో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు టక్ జగదీశ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.  గోదావరి నేపథ్యంలో ఈ సినిమా తెరక్కనుంది.

 

కాగా, ఈ సినిమాలో రీతూ వర్మ, కౌసల్య కృష్ణమూర్తి ఫెమ్ ఐశ్వర్య రాజేష్ లు  కథానాయికలుగా నటిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో నటించే నటీ నటీమణులు ఎవరన్న  సంగతి త్వరలోనే ప్రకటించనున్నారని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో నాని ఏ విదంగా కనిపిస్తాడా చూడాలి.. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: