9 ఈ అంకెతో చాలామంది సెలబ్రిటీలకు సెంటిమెంట్ లింకు ఉంది. ఈ అంకెను ఎంతో సెంటిమెంట్గా భావించే వారిలో ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని చెప్పుకుంటారు. తన కారు నెంబర్లన్నీ కూడా 9 వచ్చే విధంగా ఆయన చూసుకుంటారు. ఈ 9 ని సెంటిమెంట్గా భావించే వారిలో ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరిపోయాడు. తన గత చిత్రం మహర్షి సినిమా కి సంబంధించిన పోస్టర్ కానీ.. టీజర్ కానీ.. ట్రైలర్ కానీ  ప్రతిదీ సమయం 9 అంకె కలిసి వచ్చేలా రిలీజ్ చేశారు. ఆ మహర్షి సాధించిన ఘన విజయానికి 9 కూడా ఒక కారణం గా భావించి ఇప్పుడు మహేష్ బాబు టీం సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా   అదే సెంటిమెంట్ నీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది. 

 

ఇప్పటివరకు సరిలేరు నీకెవ్వరు సినిమాకి సంబంధించిన పోస్టర్లు కానీ.. లిరికల్ ఆడియో సాంగ్ కానీ.. విడుదలైన సమయంలో 9 అంకె కలిసి వచ్చేలా అంటే 5:04(5+4=9) విడుదల చేశారు. ఇక మునుముందు కూడా సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించి విడుదల చేసే ఎటువంటి విషయమైనా,   సమయంలో కచ్చితంగా 9  అంకె కలిసి వచ్చేలా మహేష్ బాబు టీం చూసుకుంటారని తెలుస్తుంది. ఇప్పటికే ప్రతి సోమవారం సరిలేరు నీకెవ్వరు పాటలను ప్రతి సోమవారం విడుదల చేయబోతున్నట్లు టీం ప్రకటించి ఉంది. అయితే గత సోమవారం మాత్రమే కాకుండా.. వచ్చే సోమవారాలు కూడా 05:04 నిమిషాలు లేదా ఆ అంకెలను కలిపితే 9 వచ్చేలా ఉండే సమయానికి మాత్రమే పాటలను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. 

 

 

జనవరి 11న సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. గత సంవత్సరం f2 సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని రుచి చూసిన అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇక ఎన్నో సంవత్సరాల తర్వాత లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి ఈ సినిమాలో ఒక ప్రముఖ పాత్ర పోషించారు. అలాగే బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరొందిన బండ్ల గణేష్ కూడా ఈ సినిమా ద్వారా తన రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. అల వైకుంఠపురం లో సినిమా కూడా జనవరి 12న విడుదల అవుతున్న సందర్భంలో సరిలేరు నీకెవ్వరు సినిమా టీం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఈ తొమ్మిది సెంటిమెంటు ఈ సినిమాని కూడా గట్టెక్కిస్తుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: