మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మన యంగ్ రెబల్ స్టార్ వల్ల ఆటంకం ఏంటి? అని అనుకుంటున్నారా? ఇది నిజమే అని సినీ వర్గాల నుంచి ఒక వార్త వెలువరింది. దర్శకుడు కొరటాల శివతో మూవీ చేయటానికి ఏ హీరో అయినా ఎదురు చూస్తారు. ఆయన దర్శకత్వం అలా ఉంటుంది మరి. గత కొంతకాలంగా రామ్ చరణ్ కొరటాల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుని ప్లాన్ చేసుకున్నారు. కానీ తర్వాత కొరటాల శివ ప్రభాస్ తో మిర్చి సినిమా చేసి మంచి విజయం సాధించారు.
ప్రభాస్ కెరీర్ లో ఇదొక మంచి సినిమా. మిర్చి సినిమా తర్వాత రామ్ చరణ్ కాంబినేషన్లో ఒక మూవీ ప్రారంభమైంది కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

     ఆ  తర్వాత కొరటాల శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు... తాజాగా రామ్ చరణ్ అభిమానులకు ఒక మంచి వార్త కొరటాల మరియి రామ్ చరణ్ కలిసి మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ లో ఒక సినిమా చేస్తున్నారు. కానీ ఇప్పటి దాకా సెట్స్ పైకి రాలేదు. ఇప్పుడు ఇదే మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ లో రామ్ చరణ్ తన డేట్స్ ని తన తండ్రి చిరంజీవి నటించిన సినిమా కోసం కేటాయించేసారు. ఈ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని రామ్ చరణ్
కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ బ్యానర్ లో సైరా మూవీని రామ్ చరణ్ నిర్మించారు.అది మంచి హిట్ కొట్టింది. తర్వాత అయినా కొరటాలతో మూవీ చేద్దామని ప్లాన్ చేసుకుంటే మళ్ళీ వీళ్ళ మధ్యలో ప్రభాస్ వచ్చాడు.

    రెబల్ స్టార్ ప్రభాస్ కి సాహో మూవీ తో అనుకున్న విజయం సాధించలేదు. బాహుబలి తర్వాత వచ్చే సాహో మూవీ ఒక రేంజ్ లో ఉంటుంది అనుకుంటే అది కాస్త ప్లాప్ అయింది.. ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు. ప్రభాస్ కెరీర్ లో ఒక డిసాస్టర్ లా మిగిలింది.


అందుకే నెక్స్ట్ సినిమా విషయంలో ఆచి తూచి అడుగేస్తున్నారు. తన నెక్స్ట్ మూవీని కొరటాల తో తీయాలని ప్లాన్ చేస్తున్నారట.. ఇప్పటికే కొరటాలని లాక్ చేసినట్లు, వీరి కాంబినేషన్ ఆల్మోస్ట్ ఓకే అయినట్లే అంటున్నారు.. అపుడు మిర్చి మూవీ వల్ల రాంచరణ్ కి కొరటాలతో సినిమా చేసే అవకాశం పోయింది.. మళ్ళీ ఇప్పుడు కూడా సినిమా చేద్దామంటే ప్రభాస్ మధ్యలో వచ్చారు... ఎప్పటికి రామచరణ్ -కొరటాల సినిమా మొదలుఅవుతుందో చూడాలి. వీళ్ళ కాంబినేషన్ కోసం అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: