నందమూరి బాలకృష్ణ తో బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పుడు మళ్లీ బాలయ్యతో జతకట్టబోతున్నాడు. బాలకృష్ణ తన 106వ చిత్రానికి బోయపాటి శ్రీను కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే బోయపాటి శ్రీను నందమూరి నటసింహం బాలకృష్ణతో చేసిన సింహ, లెజెండ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద  సందడి చేశాయి. ఈ సందర్భంలో మళ్లీ వారి కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉంటాయి.  తన గత చిత్రం వినయ విధేయ రామ పరాజయం నేర్పిన  పాఠాలు మరియు బాలకృష్ణతో కాంబినేషన్ పై ఉండే   అంచనాల నేపథ్యంలో  బోయపాటి శ్రీను ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడట. 

 

ఇప్పటివరకు తనకు అసిస్టెంట్లుగా పనిచేసిన  వారిలో కొంతమంది ని తొలగించి, కొత్త ఆలోచనలు చేయగలిగిన అసిస్టెంట్ డైరెక్టర్ లను తన వద్ద నియమించుకున్నాడట. అలాగే ఈ సినిమాకి మరింత హైప్ వచ్చేలా వైసిపి ఎమ్మెల్యే రోజాని లేడీ విలన్గా చేసేందుకు సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆమె ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఇంతకుముందు బాలకృష్ణతో హీరోయిన్ గా నటించిన రోజా ఇప్పుడు విలన్గా చేస్తే అది ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అవుతుందన్నది మాత్రం నిజం. 

 

అలాగే ఈ సినిమా కోసం హీరోయిన్ గా కన్నడ బ్యూటీ రచిత రామ్  ని  సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో  ఉండే పవర్ ఫుల్  డైలాగుల కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నారట. గత చిత్రాలతో పోలిస్తే బోయపాటి శ్రీను ఈ చిత్రం చాలా భిన్నంగా ఉండేటట్లు, అలాగే తమ మాస్ ఎలిమెంట్స్ ఎక్కడా మిస్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. తమ కాంబినేషన్లో వచ్చే ఈ సినిమా తమ కెరీర్లో ఒక మైలురాయిగా ఉండేలా  కథ కథనాలపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. ఈ సినిమా షూటింగ్ డిసెంబర్ చివరి వారం నుండి మొదలు కాబోతుంది. తమ గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: