ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు డైరెక్టర్లు నిర్మాతలు సౌత్ లో రికార్డులు సృష్టించిన సినిమాల వైపు మరియు స్టార్ హీరోల వైపు అదేవిధంగా స్టార్ హీరోయిన్ ల వైపు చూస్తూ బాలీవుడ్ లో వారితో సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో కండలవీరుడు సల్మాన్ ఖాన్ గతంలో తనకు వరుసగా ఫ్లాపులు వచ్చిన తరుణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్ అయినా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'పోకిరి' సినిమాని బాలీవుడ్లో వాంటెడ్ సినిమాగా రీమేక్ చేసి అదిరిపోయే హిట్ అందుకొని అప్పటినుండి వరుస విజయాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇటువంటి తరుణంలో తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే సల్మాన్ తో నటించే ఛాన్స్ కొట్టినట్లు ఫిలింనగర్లో వార్తలు వినపడుతున్నాయి.

 

ఇటీవలే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి హౌజ్ ఫుల్ 4 అనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. హౌజ్ ఫుల్ 4 సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో నిర్మాత సాజిద్ నదియాద్వాల పూజతో మరో మూడు సినిమాలు చేయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే సల్మాన్ ఖాన్ నటించబోయే కిక్ 2 సినిమాలో పూజా హెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో పూజా స్క్రీన్ షేర్ చేసుకుంటుందా అన్న వార్త ఇప్పుడు బయటకు రావడంతో ఈ వార్త అటు బాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది.

 

ఇదే క్రమంలో కొత్త కొత్త నటీనటులను ఎంకరేజ్ చేయడంలో ముందుండే సల్మాన్ ఖాన్ సౌత్ ఇండస్ట్రీలో అనేక విజయాలు నమోదు చేసుకున్న పూజా హెగ్డే తో సినిమా చేయడానికి కూడా ఎక్కడ వెనుకాడకుండా ఆమెతో నటించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: