‘ఆర్ ఎక్స్ 100’ మూవీ సూపర్ సక్సస్ తో క్రేజీ హీరోయిన్ గా మారిన పాయల్ రాజ్ పుత్ త్వరలోనే టాప్ హీరోయిన్ స్థాయికి చేరి పోతుందని కొంతమంది అంచనాలు వేసారు. అయితే ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు ఫెయిల్ అవ్వడంతో పాటు ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఆర్ డి ఎక్స్ లవ్’ భయంకరమైన ఫ్లాప్ గా మారడంతో ఆమె క్రేజ్ ఒక్కసారి దిగిపోయింది.

అయినా ఆమె తన క్రేజ్ ను నిలుపు కోవడానికి అనేక హాట్ ఫోటో షూట్స్ ఇస్తూ యంగ్ హీరోయిన్స్ రేస్ లో నిలబడటానికి తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఈమె సీనియర్ హీరో వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘వెంకీ మామ’ సినిమా పై చాల ఆశలు పెట్టుకుంది. 

మూవీ రిలీజ్ డేట్ ఈ నెల 13 ఫిక్స్ కావడంతో పాయల్ రాజ్ పుత్ ఆనందానికి అవధులు లేవు అని అంటోంది. అంతేకాదు తాను ప్రస్తుతం ఆనందంతో మేఘా లపై తెలిపోతున్నానని అంటూ 9వ మేఘం మీద ‘క్లౌడ్ నైన్’ పై తెలిపోతున్నాను అంటూ తన ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఒక షాకింగ్ ట్విట్ పెట్టింది.  

"నేను కలగంటున్నానేమో.. నన్ను గిల్లండి. వెంకటేష్ సర్ తో కలిసి నటించడం అనేది నాకల నిజమైనట్టు" అంటూ ఒక ట్వీట్  చేసింది.  ఈ ట్విట్ చూస్తే ఈ మూవీ విజయం పై పాయల్ ఎన్ని ఆశలు పెట్టుకుందో అర్ధం అవుతుంది. అంచనాల ప్రకారం ఈ సినిమా హిట్ కొడితే పాయల్ రాజ్ పుత్ సీనియర్ హీరోల హీరోయిన్ గా మారి ప్రస్తుతం సీనియర్ హీరోలకు ఏర్పడిన హీరోయిన్స్ సమస్యకు ఒక పరిష్కారం చూపెట్ట గలుగుతుంది. అయితే ఈ మూవీలో ఈమెతో పాటుగా మరో గ్లామర్ బ్యూటీ రాశి ఖన్నా కూడ నటిస్తున్న నేపధ్యంలో సగటు ప్రేక్షకుడు ఈ ఇద్దరి హీరోయిన్స్ పోటీలో ఎవరికీ ఎక్కువ మార్కులు వేస్తాడో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: