90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగి స్టార్ హీరోలందరి పక్కన నటించి వరుస ఆఫర్లు దక్కించుకున్న హీరోయిన్ టబు ఎక్కువగా సౌత్ లో సినిమాలు చేస్తూ అప్పట్లో బిజీ బిజీ హీరోయిన్ గా మారింది. తరువాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ 48 సంవత్సరాలు వయసు వచ్చిన ఎక్కడా కూడా తన ఫిజిక్ ఏ మాత్రం తగ్గకుండా ఆకర్షించే విధంగా మెయింటెన్ చేస్తూ సినిమాలు దక్కించుకుంటూ అప్పటిలో 90లో ఉన్న కుర్రకారును ఏ విధంగా ప్రభావితం చేసిందో అదే విధంగా ప్రస్తుతం ఉన్న యువతరాన్ని ఆకట్టుకునే విధంగా తన అందాన్ని మెయింటేన్ చేస్తూ అదిరిపోయే అవకాశాలు దక్కించుకుంటూ మొన్నటిదాకా బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేసిన టబు తాజాగా 'అలా వైకుంఠపురం లో' అనే సినిమాతో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ ఇండస్ట్రీ లో రీ ఎంట్రీ ఇస్తోంది.

 

ఇదిలా ఉండగా త్వరలో లేడీ డైరెక్టర్ మీరా నాయర్ దర్శకత్వంలో ఒక బోల్డ్ కాన్సెప్ట్ కలిగిన సినిమాతో ఒక కుర్రవాడితో రొమాన్స్ చేయించే కథలో హీరోయిన్ టబు సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. అయితే ఈ కథ ఒక వరండాలో నాలుగు కుటుంబాలు నివసించే నేపథ్యంలో సాగే కథ అని.. ఆ సమయంలో తనకంటే వయసులో పెద్దదైన మహిళతో కుర్రాడి ప్రేమకు సంబంధించిన కథాంశమని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి.

 

కుర్రవాడి పాత్రలో ఇషాన్ ఖట్టర్ అనే నటుడు నటిస్తున్నట్లు సమాచారం. విక్రమ్ సేథ్ రాసిన కథ ఆధారంగా ఈ టీవీ సీరిస్ ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో టబు, ఇషాన్ ఖట్టర్ ల మధ్య కొన్ని బోల్డ్ సన్నివేశాలు కూడా ఉంటాయని సమాచారం. గతంలో కూడా ఆంటీ, అబ్బాయ్ ల చుట్టూ తిరిగే కథలు వచ్చాయి. మరి బోల్డ్ కాన్సెప్ట్ లను ఎన్నుకొని సినిమాలుగా తెరకెక్కించే లేడీ డైరెక్టర్ మీరా నాయర్ దర్శకత్వంలో రాబోయే ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షక ఆదరణ పొందుతుందో చూడాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: