సినీ రంగం విచిత్రమైనది. ఇక్కడ చాలా స్టాంపులు రెడీగా ఉంటాయి. ఫస్ట్ చాన్స్ అంటూ ఒక సినిమాలో నటించి అది హిట్ అయితే చాలు ఇక అదే రకం పాత్రలు అంటకడతారు. పొరపాటున విలన్ పాత్ర దొరికితే ఇక లైఫ్ లాంగ్ విలనే, బోల్డ్ గా కనిపిస్తే ఆ పాత్రలకే పిలుస్తారు. ఓ విధంగా రొటీన్ అయిపోయి మాకొద్దీ పాత్ర అన్నా కూడా డైరెక్టర్ కానీ, నిర్మాత కానీ అసలు క్షమించరే.

 

ఇపుడు అలాంటి ఇమేజ్ లో హాట్ బేబీ పాయల్ రాజ్ పుత్ ఉందిట. ఆమె తొలి సినిమా ఆర్ ఎక్స్ 100. ఇందులో కాస్తా బోల్డ్ గా సెక్సీగా  కనిపించిన పాయల్ పెద్ద హిట్ కొట్టేసింది. దాంతో ఈసారి అలా కాదని ఆర్డీఎక్స్ లవ్ అంటూ పాయల్ మీద ప్రయోగం చేశారు. ఇందులో మరికాస్తా ఎక్కువ ఎక్స్ పోజింగ్ తో పాటు పాయల్  విరగదీసి నటించడంతో ఆమె ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.

 

బీ గ్రేడ్ హీరోయిన్ అంటూ కొత్త ట్యాగ్ తగిలించేశారట. దీంతో ఈ అమ్మడు తెగ కలవరపడింది. ముందు ఈ ఇమేజ్ ని ఎలాగైనా పోగొట్టుకోవాలనుకుంది.  దాంతో ఆమెకు సరైన టైంలో బ్రేక్ లా సీనియర్ హీరో వెంకటేష్ మూవీ దొరికిందట. అదే వెంకీమామ. ఓ విధంగా తనకు ఈ చాన్స్ వరం అంటోంది ఈ ముద్దుగుమ్మ.

 

ఎందుకంటే వెంకటేష్ కి ఫ్యామిలీ హీరో అన్న ముద్ర ఉంది. దాంతో ఆయన పక్కన నటిస్తే బోల్డ్ ఇమేజ్ ముద్ర పోయి మళ్ళీ రొటీన్ ఇమేజ్ కి రావచ్చునని తద్వరా మరిన్న కొత్త చాన్సులు దక్కించుకోవచ్చునని పాయల్ ఆలోచిస్తోందట.  దాంతో కచ్చితంగా తనకు వెంకీమామ హిట్ కావాలని కోరుకుంటోందట.

 

ఇక ఈ మూవీలో పాయల్ యంగ్ గానే నటిస్తోందట. ఆమె వెంకటేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అందంగా మెరుస్తుందని, ఇద్దరికీ ఒక బ్యూటీఫుల్ సాంగ్ కూడా ఉందని అంటున్నారు. మరి పాయల్ రాజ్ పుత్ కి వెంకీ మామ హిట్ తరువాత దశ తిరుగుతుందని భావిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: