నిన్న మొన్నటి వరకు చిత్ర పరిశ్రమలో రికార్డులను తిరగరాసిన పవన్ కళ్యాణ్… ఇప్పుడు ఆ చిత్ర పరిశ్రమపైనే తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. కాగా గత కొంత కాలంగా సినిమాలను పక్కనబెట్టి రాష్ట్ర రాజకీయాలతో చాలా బిజీగా గడుపుతున్నటువంటి పవన్ కల్యాణ్, ఇప్పుడు ఉన్నపళంగా చిత్ర పరిశ్రమపై ఇలా సంచలన వాఖ్యలు చేయడం అనేది చర్చనీయయాంశంగా మారింది. అయితే పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా తెలుగు భాషను కాపాడుకుందాం అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై ఒక రేంజ్ లో ఫైర్ అవుతున్నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్… “మన భాషను కాపాడుకుందాం, ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా తెలుగును బతికించుకుందాం” అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రంగా పోరాడుతూ, అందరిని తనతో కలుపుకుపోతున్నాడు.

 

అయితే పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమపై ద్రుష్టి కేంద్రీకరించారు. అసలు ఎప్పుడు కూడా తన సొంత ఇల్లు లాంటి చిత్ర పరిశ్రమ పై ఒక్క విమర్శ కూడా చేయనటువంటి పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఏకంగా మన హీరోలపై టార్గెట్ పెట్టారు. “మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలకు తెలుగు చదవడం, రాయడం రాదని, అది నేర్చుకోవాల్సిన కనీస బాధ్యత కూడా లేదా” అంటూ విమర్శలు చేశారు. ప్రస్తుతానికి తెలుగు భాష దిగజారిపోతుందని, దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు అందరు నటులపై కూడా ఉందని గుర్తించుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా పవన్ కల్యాణ్ అన్నట్లుగానే చిత్ర పరిశ్రమలో కొందరికి నిజంగానే తెలుగు రాయడం, చదవడం రాదు. అయితే పవన్ చేసిన ఈ వాఖ్యలపై విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. గతంలో కూడా పవన్ తన సినిమాల్లో ఇంగ్లీష్ పాటలు పెట్టుకున్నప్పుడు గుర్తుకు రానిది, ఇపుడెందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నాడని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

 

నిజంగానే మన ఇండస్ట్రీలో మహేష్ బాబు సహా మరికొందరు హీరోలకు తెలుగు చదవడం రాదు. కానీ వాళ్లు అవేం తెలియకుండా చక్కగా తమ పని తాము చేసుకుంటున్నారు. కానీ పవన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. టాలీవుడ్‌లో తెలుగు దిగజారిపోతుందని.. దాన్ని బతికించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలతో పాటు నటులపై కూడా ఉందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: