ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న కలకలం సృష్టిస్తున్నాయి. ఈమధ్యనే జరిగిన దిశ ఘటన షాక్ నుండి ఇంకా ఎవరు తేరుకోకుండానే భాగ్యనగరానికి చెందిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మహిళ ఆర్ట్ డైరెక్టర్ పై కొందరు ఆకతాయిలు ఎటాక్ కు ప్రయత్నించారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బంజారాహిల్స్ ప్రాంతంలో ఒక కారులో వెళుతున్న టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఈ మహిళ ప్రయాణిస్తున్న కారును కొందరు యువకులు ఢి కొట్టడమే కాకుండా ఆమెను కారు లోంచి బయటకు లాగి దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వీరంతా మైనర్లు మాత్రమే కాకుండా చాల అసభ్య పదజాలంతో ఆమెను దూషించినట్లు తెలుస్తోంది. 

ఆమె సినీ ఆర్ట్ డైరెక్టర్ అని గ్రహించి కావాలని తనను వెంబడించడమే కాకుండా వారంతా కావాలని తనను దుర్భాషలు ఆడినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇలా కొనసాగుతూ ఉండగానే రాజమండ్రిలో 50 సంవత్సరాల మహిళను గ్యాంగ్ రేప్ చేసినట్లుగా వస్తున్న వార్తలు మరింత కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలుగు రాష్ట్రాల లోని మహిళలు ఇలా జరుగుతున్న ఈ సంఘటనలు చూసి కలవర పడుతున్నారు. 

ఒకవైపు దిశ సంఘటన పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఈ అత్యాచార సంఘటనల దురాగతాలు కొనసాగుతూనే ఉండటంతో ఈ సమస్యకు పరిష్కారం ఎలా అంటూ మేధావుల దగ్గర నుండి సామాన్యులు వరకు కూడ ఆలోచనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏమిటంటే దిశ రేప్ జరిగిన స్పాట్ కు అనేక అమంది కార్లులో బైక్స్ పై వస్తూ దిశ పై అత్యాచారం జరిగిన స్పాట్ ను చూస్తూ అక్కడ నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితులలో దిశ రేప్ జరిగిన ప్రాంతం ఒక టూరిజమ్ స్పాట్ గా మారిపోయింది అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ప్రచురించిన కథనం చదివిన వారికి మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: