జబర్దస్త్ తో నాగబాబు సుదీర్ఘ ప్రయాణం తర్వాత   అనుకోని మనస్పర్దలవల్ల  ‘జబర్దస్త్’ కామెడీ షో నుంచి బయటికి వచ్చేసాడు ఆ తర్వాత అయన  జీ టీవీతో చేరిన సంగతి తెలిసిందే. ‘జబర్దస్త్’కు పోటీగా ‘లోకల్ గ్యాంగ్స్’ అనే కామెడీ షోను కూడా  మొదలుపెట్టారు. అయితే, ‘జబర్దస్త్’ నుంచి బయటికి వచ్చేసిన నాగాబాబు ఊరికే ఉండక  ఆ షో నిర్వాహకులపై తీవ్ర  ఆరోపణలు చేస్తూ వరుసపెట్టి వీడియోలను పెడుతూ ఉన్నారు . ఇంకా పెడుతూనే  ఉన్నారు.

 

.తాను ‘జబర్దస్త్’ నుంచి బయటికి వచ్చేయడానికి గల కారణాలు తెలుపుతూ ఇప్పటికే నాగబాబు నాలుగు వీడియోలు విడుదల చేశారు. అయితే, కానీ  ఆ  నాలుగు వీడియోలు చూసినా  అసలు ఆయన ‘జబర్దస్త్’ వదిలి పెట్టడానికి గల  అసలు కారణమేంటో ఎవ్వరికీ అర్థం కాలేదు . కాకపోతే, ఈ వీడియోల ద్వారా ‘జబర్దస్త్’ యాజమాన్యాన్ని టార్గెట్ చేశారని మాత్రం బాగా అర్తం అవుతోంది  నిజం చెప్పాలంటే.. తానూ ఎందుకు మానేసాను అన్న దాని కంటే కూడా  ఈ వీడియోల్లో ‘జబర్దస్త్’ నిర్వాహకులపై ఆరోపణలే ఎక్కువగా చేసారు .

 

ఇన్ని రోజులు అయన ఆ షో కి జడ్జి గ వ్యవహరించిన అంత కాలం కనపడని తప్పులు అన్ని ఒక్కసారిగా ఆయన   ‘ జబర్దస్త్’ షో వెనుక జరిగే ప్రతి విషయాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ షోను నడిపిస్తోన్న మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి కానీ, ఈటీవీ యాజమాన్యం కానీ కంటెస్టెంట్ల ఇబ్బందులను పట్టించుకోఋ అంటూ  ఆరోపించారు. వాళ్లకు కేవలం డబ్బే ముఖ్యమని అన్నారు. కంటెస్టెంట్లకు సరిగా తిండి కూడా పెట్టేవారు కాదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

 

రాం ప్రసాద్‌కు కిడ్నీ సమస్య వచ్చి చావు బతుకుల్లో ఉంటే అతడిని అస్సలు పట్టించుకోలేదని అన్నారు. తాను చొరవ తీసుకుని రాం ప్రసాద్‌కు సాయం చేశానని వివరించారు ఆ  విషయాలను గుచ్చి గుచ్చి చెబుతున్నారు. ఈ వీడియోలను యూట్యూబ్ ద్వారా చాలా మంది చూస్తున్నారు. ఈ ప్రభావం కచ్చితంగా ‘జబర్దస్త్’ ఇమేజ్‌పై పడుతుంది. ఇదే విషయాన్ని చాలా యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఛానెళ్లు జబర్దస్త్ యాజమన్యాన్ని ప్రశ్నిస్తున్నాయి.

 

అయినప్పటికీ ‘మల్లెమాల’ స్పందించడంలేదు.నాగబాబు వీడియోలపై ఎవ్వరి దగ్గర నోరు విప్పొద్దని ‘జబర్దస్త్’ కంటెస్టెంట్లకు ‘మల్లెమాల’ యాజమాన్యం సూచించిందని సమాచారం. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై అస్సలు స్పందించొద్దని.. తొందరపడి పోస్టులు పెట్టొద్దని సీరియస్‌గానే చెప్పిందట. నాగబాబును కంట్రోల్ చేయడం ఇప్పుడు తమ వల్ల కాదు కాబట్టి.. ఆయన కామెంట్లపై నోరు విప్పకుండా ఉంటే చాలని యాజమాన్యం భావిస్తోందని తెలిసింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: