కేఎస్ ర‌వికుమార్ దర్శకుడిగా నందమూరి బాల‌కృష్ణ‌ హీరోగా రూల‌ర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

అయితే ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదిన రిలీజ్ చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అయితే రూలర్ సినిమా తరువాత బాలకృష్ణ బోయపాటితో కలిసి సినిమా చేయబోతున్నాడు. అయితే బోయపాటి, బాలయ్య కాంబినేషన్‌లో సింహా, లెజెండ్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు వీరిద్దరి మధ్య వచ్చే ఈ సినిమాపై కూడా బాలయ్య అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో జబర్దస్త్ నుంచి చాలా మంది నటించబోతున్నట్లు సమాచారం. అయితే జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నారని, వైసీపీ ఎమ్యెల్యే రోజా కూడా ఈ చిత్రంలో ఒక పవర్‌పుల్ లేడీ క్యారెక్టర్‌లో నటించబోతుందని ఇది వరకే ప్రచారం జరుగుతుంది. అయితే ప్రధాన పాత్రలు కావడంతో రోజా, అనసూయ కూడా ఒప్పేసుకున్నారని ఇకపోతే మరింత మంది జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఈ సినిమాలో నటిస్తున్నారని సమాచారం.

 

ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ప‌క్కా యాక్ష‌న్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంది.  సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై సీ క‌ళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా కేఎస్‌.ర‌వికుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, భూమిక కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు.అభిమానులు ఇప్పటికే ఈ సినిమా మీద అంచనాలు పెట్టుకున్న నందమూరి ఫాన్స్ ని ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్ మ‌రియు సాంగ్  ఆకట్టుకున్నాయ‌నే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: