సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్.   అసలు పేరు శివాజీరావు గైక్వాడ్...జన్మతః మరాఠీ అయినా తమిళనాట స్థిరపడ్డారు.  రజినీకాంత్ సినిమా వస్తుందంటే తమిళ అభిమానులు పండుగ చేసుకుంటారు.  థియేటర్ల ముందు రజినీ కి సంబంధించిన భారీ కటౌట్స్ పెట్టి పాలాభిషేకాలు చేస్తుంటారు.  భారతీయ సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు రజినీకాంత్.  తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల కాంబినేషన్ లో నటించారు.  ఇటీవల రజినీకాంత్ రాజకీయాల్లో కూడా తన ముద్ర వేస్తున్న విషయం తెలిసిందే.  అభిమానులంటే ముందు నుంచి రజినీకి ప్రత్యేక అభిమానం.

 

 ఆ మద్య రజినీకాంత్ ని ఓ అభిమాని ఫాలో అవుతూ ఇంటి వద్దకు వచ్చాడు.. ఆ అభిమానిని తన సెక్యూరిటీతో చెప్పి ఇంట్లోకి ఆహ్వానించి ఇలాంటివి మళ్లీ చేయవొద్దని హితవు పలికి ఓ సెల్ఫీ తీసుకొని సంతోష పెట్టారు.  ఇలా రజినీకాంత్ గురించి ఎన్న చెప్పినా తక్కువే అంటారు ఆయన అభిమానులు. తాజాగా  కేరళ యువకుడు ప్రణవ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలవడానికి ‘ఆనంద వికటన్’ అనే తమిళ వారపత్రిక ద్వారా తన జీవితకాల స్వప్నాన్ని వ్యక్తం చేశాడు. తన అభిమాని అభిమతం తెలుసుకున్న రజినీ   వెంటనే చెన్నైలోని తన పోయెస్ గార్డెన్‌లో ఆ వ్యక్తి తనను వ్యక్తిగతంగా కలుసుకునేలా ఏర్పాట్లు చేశాడు.  అయితే రజినీకాంత్ ప్రణవ్ ని కలుసుకోవడమే కాదు... అతని కాళ్లు కూడా పట్టుకున్నాడు.

 

ఎందుకంటే ఆ అభిమానికి రెండు చేతులు లేవు. కాళ్లతోనే తాను చేసుకోగలిగే పనులు చేసుకుంటున్నాడు. ఆ అభిమానికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి రజినీ అతని కాలు పట్టుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.   ప్రణవ్ సూపర్ స్టార్ కు తాను గీసిన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ప్రణవ్‌కు చేతులు లేనప్పటికీ  కాళ్లతో చాలా పనులు చేయగలడు. కేరళ ముఖ్యమంత్రితో ఆయన ఇటీవల తీసుకున్న సెల్ఫీ వైరల్ అయ్యింది.  ప్రస్తుతం సూపర్ స్టార్‌తో ఆ అభిమాని తీయించుకున్న ఫోటో తెగ వైరల్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: