మెగాబ్రదర్ నాగబాబు మొదట్లో అన్నయ్య చిరంజీవితో కలిసి పలు సినిమాల్లో నటించడంతో పాటు తన అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొన్ని సినిమాలు కూడా నిర్మించడం జరిగింది. తొలిసారిగా 1988లో మెగాస్టార్ చిరంజీవితో రుద్రవీణ అనే సినిమాను తన సంస్థపై నిర్మించారు నాగబాబు. దిగ్గజ దర్శకుడు బాలచందర్ దర్శకత్వంలో దాదాపుగా ఏడాదిన్నర పాటు రూపొందిన ఆ సినిమాకు అప్పట్లో రూ.90 లక్షల వరకు ఖర్చు అయిందట. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. 

 

ఇక ఆ తరువాత మెగాస్టార్ తో కలిసి త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు సినిమాలు నిర్మించారు నాగబాబు. అయితే వాటిలో ఒక్క బావగారు బాగున్నారా మాత్రమే కమర్షియల్ గా మంచి సక్సెస్ సాధించింది. అనంతరం తానే హీరో మరియు నిర్మాతగా కౌరవుడు అనే సినిమాను నిర్మించినప్పటికీ అది కూడా సక్సెస్ కాలేదు. ఆ తరువాత తన తమ్ముడు పవర్ స్టార్ తో గుడుంబా శంకర్, శ్రీకాంత్ తో రాధాగోపాలం, మెగాస్టార్ తో స్టాలిన్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆరెంజ్ సినిమాలు నిర్మించినప్పటికీ, అవన్నీ చాలా వరకు ఆయనకు నష్టాలే తెచ్చిపెట్టాయి.

 

ఇక దానితో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన నాగబాబుకు తన సోదరులైన చిరు, పవన్ లు ఆదుకుని వాటి నుండి తనను గట్టెక్కించారని ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో ఎంతో ఉద్వేగభరితంగా మాట్లాడుతూ చెప్పారు. తాను ఎంతో నమ్మకంగా నిర్మాతగా సెటిల్ అవ్వొచ్చని భావించానని, అయితే తనకు సమయం కలిసి రాకపోవడం వల్లనే తాను నిర్మించిన సినిమాలు దెబ్బతిని చావు దెబ్బేసాయని, కాబట్టి ఇకపై సినిమా నిర్మాణం వైపు వెళ్లకూడదని గట్టిగా నిర్ణయించారట నాగబాబు. ఇక ఇటీవల జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన నాగబాబు, ప్రస్తుతం మరొక టివి ఛానల్ లో ప్రసారం అవుతున్న ఒక కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: