కొత్త బంగారు లోకం తో  డైరెక్టర్ గా ఎంట్రీ  ఇచ్చాడు  శ్రీకాంత్ అడ్డాల.  మొదటి సినిమా నే  సూపర్ హిట్ కావడంతో  రెండో ప్రయత్నంలో  ఏకంగా స్టార్ హీరోలను ఒప్పించి  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు  తెరకెక్కించగా  ఈ చిత్రం కూడా  సూపర్ హిట్ కావడంతో  క్రేజీ  డైరెక్టర్ గా మారిపోయాడు.  ఆతరువాత  వరుణ్ తేజ్ తో ముకుంద అనే చిత్రాన్ని తెరకెక్కించాడు కానీ ఈ సినిమా ప్లాప్ అయ్యింది.  అయితే దీని వల్ల శ్రీకాంత్ అడ్డాలకు  పెద్దగా నష్టం కలుగలేదు  కానీ  ఈ సినిమా తరువాత  మహేష్ బాబు తో తెరకెక్కించిన  బ్రహ్మోత్సవం ,శ్రీకాంత్ అడ్డాల కెరీర్ ను  డ్యామేజ్ చేసింది.  ఈచిత్రం భారీ డిజాస్టర్ కావడంతో తను  మళ్ళీ అవకాశం రాబట్టుకోవడానికి  నాలుగేళ్లు పట్టింది. 
 
 
 
ఇక ఇప్పుడు ఈ డైరెక్టర్ కి ఆవకాశం వచ్చింది.  తమిళ హీరో  ధనుష్  నటించిన అసురన్ ఇటీవల  విడుదలై  బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఈ చిత్రాన్ని  ఇప్పుడు తెలుగులో  రీమేక్ చేయనున్నారు. ఇందులో వెంకటేశ్ హీరోగా నటించనుండగా  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ చిత్రానికి  శ్రీకాంత్ అడ్డాల కు రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదట. సినిమా హిట్ అయితే  అందులో  వచ్చిన ప్రాఫిట్స్  లో షేర్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట.  షూటింగ్ సమయంలో శ్రీకాంత్ అడ్డాల కు  అయ్యే ఖర్చులు మాత్రమే  నిర్మాతలు భరించనున్నారు.
 
 
15కోట్ల బడ్జెట్ తో  తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ తాను , సురేష్ బాబు  నిర్మించనున్నారు.   రూరల్ బ్యాక్ డ్రాప్ లో   రూపొందనున్న ఈచిత్రంలో శ్రీయ  హీరోయిన్ గా నటించనుంది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: