అర్జున్ రెడ్డి సినిమాతో యావత్ దేశం మొత్తం క్రేజ్ తెచ్చుకున్న నటుడు విజయ్ దేవరకొండ. ఈ ఒక్క సినిమా అరని కెరీర్ ని పూర్తిగా మార్చేసింది. పెళ్ళి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కొంత గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో అర్జున్ రెడ్డితో యూత్ స్టార్ గా ఎదిగిపోయారు. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరోకి డియర్ కామ్రేడ్ రూపంలో సడెన్ గా బ్రేక్ పడింది. సినిమా విమర్శకులని మెప్పించినప్పటికీ ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది.

 

డియర్ కామ్రేడ్ ఫలితం అతని కెరీర్ కేమీ పెద్ద అడ్డంకి గా నిలవలేకపోయింది. విజయ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ వచ్చే సంవత్సరం ప్రేమికుల రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన చిత్రీక్రణ శరవేగంగా జరుపుకుంటుంది. ఇప్పటికే విదేశాల్లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది.

 


హైదరాబాద్ లోని హైటెక్ సిటీ ఏరియాలో జరుగుతుంది. మరో వారం రోజులు పాటు షూటింగ్ జరుపుకోనున్న ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. విజయ్ దేవరకొండతో పాటు ఇతర ప్రధానమైన నటీనటులు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. అటు షూటింగ్ తో పాటే పోస్ట్ ప్రొడక్షన్ పానులు కూడా జరుగుతున్నాయట. మొదటి సారిగా రాశీ ఖన్నా ఈ సినిమా కోసం తనే డబ్బింగ్ చెప్పుకుంటుందట.

 

కె.ఎస్‌.రామారావు స‌మ‌ర్ప‌ణ‌లో క్రియేటివ్ క‌మ‌ర్షియల్స్ బ్యాన‌ర్‌ పై కె.ఎ.వ‌ల్ల‌భ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన రాశీఖ‌న్నా, ఐశ్వ‌ర్యా రాజేష్‌, క్యాథెరిన్ థెరిస్సా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీని తర్వాత విజయ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఫైటర్ అనే సినిమా తెరకెక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: