చెప్పడం కాదు.. చేసి చూపించాలని అంటారు.. నిజమే ఇప్పుడు దేశం మొత్తం దిశ పై జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తుంది. పార్లమెంట్ దద్దరిల్లేలా దిశ ఘటనపై పలువురు నేతలు తమ గళం విప్పారు.  ఇక దేశం మొత్తం విద్యార్థి, మహిళా సంఘాలు దిశ కు జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు.  నింధితులను జైళ్లో పెట్టి మేపడం కాదు.. ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు.  అయితే దిశ ని అన్యాయంగా మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకు వెళ్లి కృరమృగాళ్లా అత్యాచారం చేసి దారుణంగా కాల్చి వేసిన నింధితులకు వెంటనే శిక్ష వేయకుండా వారికి బందోబస్తు జైలుకు తరలించడం పై దిశ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

 

తమకు సానుభూతి కాదు.. సరైన న్యాయం కావాలని ఆ న్యాయం జరిగే వరకు తమను ఎవరూ కలవొద్దని..సానుభూతి తెలపొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అయితే కొంత మంది ప్రముఖులు ఆ కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తున్నారు. ఇప్పటి వరకు సినీ సెలబ్రెటీలో దిశకు జరిగిన అన్యాయంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  నింధితులను కఠినంగా శిక్షించాలని.. బహిరంగంగా ఉరి తీయాలని ఆవేశంగా స్టేట్ మెంట్స్ ఇచ్చారు. కానీ ఏ ఒక నటీ, నటులు వారి కుటుంబ సభ్యులను నేరుగా కలవలేదు. కానీ ఒక్క హీరో.. ఒకే ఒక్క హీరో మంచు మనోజ్ నేరుగా దిశ కుటుంబ సభ్యులను కలిశారు.. వారికి ధైర్యం చెప్పారు.

 

ఈ సందర్భంగా  మంచు మనోజ్ మాట్లాడుతూ..  దిశ తల్లి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని ఏ ఆడ కూతురుకి ఇలాంటి అన్యాయం జరగొద్దని అన్నారు.  దేశంలో ఇలాంటి కృర మృగాళ్లకు ఉరిశిక్షే సరైన న్యాయం అని అన్నారు.   రాక్షసంగా ప్రవర్తించేవారికి బహిరంగంగా శిక్షించాలని,  ఇంకొకసారి తప్పు చేయాలంటేనే భయవేసేలా ఆ శిక్షలు ఉండాలని మనోజ్ అభిప్రాయపడ్డాడు. మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు మరిన్ని కార్యక్రమాలు చేయాలని..అలాంటి కార్యక్రమాలకు తాను తప్పకుండా భాగస్వామినావుతానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: