ఝుమ్మంది నాదం చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తాప్సీ ఆ తర్వాత చాలా చిత్రాల్లో నటించినప్పటికీ ఏది కూడా అంత గుర్తింపు తీసుకురాలేదు. మిస్టర్ పర్ ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి తనకి తానే డబ్బింగ్ చెప్పుకుని మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా మినహా తెలుగులో పెద్దగా గుర్తింపు వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అయితే గత కొన్ని రోజులుగా తాప్సీ తెలుగు సినిమాలు చేయట్లేదు.

 

తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. అదేంటేమో గానీ బాలీవుడ్ లో ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. పింక్ సినిమాలో నటించడం ఆమెకి బాలీవుడ్ లో తిరుగు లేకుండా పోయింది. నటనా ప్రాధాన్యమున్న పింక్ సినిమాలో నటించడంతో ఆమెకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. సూర్మా, గేమ్ ఓవర్ లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తీసుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం తాప్సీ ఒక బయోపిక్ లో నటించనుంది.

 

మహిళా క్రికెట్ లో మిథాలీ రాజ్ అంటే తెలియని వారుండరు. మహిళా క్రికెట్ లో ఆమె ఎన్నో రికార్డులు సాధించింది. భారత జట్టు కెప్టెన్ గా వ్యవహరించి జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. ఆమె జీవితం ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమాలో మిథాలీ రాజ్ గా తాప్సీ నటించనుంది ఈ మేరకు ఈరోజే అధికారిక ప్రకటన వెలువడింది.`శభాష్ మిథు` అనేది టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకి రాయీస్ ఫేం రాహుల్ ధోలాకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 

 

వయాకామ్ 18 స్టూడియో సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ లో  తాప్సీ దశ తిరిగినట్టే. ప్రస్తుతం తెలుగు సినిమాల్లో కనిపించకుండా పోయిన తాప్సీ ఈ సినిమా తర్వాత తాప్సీ తెలుగులో నటిస్తుందా అనేది సందేహమే.

మరింత సమాచారం తెలుసుకోండి: