నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత చాలాకాలం రాజకీయాల్లో బిజీబిజీగా గడిపారు. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో 'రూలర్' అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీంతో ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అందరూ నందమూరి అభిమానులు భావించారు. ఎందుకంటే ప్రతి యేట సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి బాలయ్య అద్భుతమైన హిట్ చాలాసార్లు అందుకున్నారు. దీంతో రాబోయే సంక్రాంతి పండుగకు బాలయ్య బాబు నటించిన 'రూలర్' సినిమా రిలీజ్ అవుతుందని సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంలో అందరూ అనుకున్నారు. తీరా సినిమాను డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. కాగా బాలయ్య నటించిన 'రూలర్' సినిమాకు డిసెంబర్ నెలలో చాలా సినిమాలు పోటీకి వస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

'రూలర్' సినిమా విడుదల అవ్వక ముందు వారం వెంకీ మామ అనే సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది. 'ఎఫ్ 2' తరువాత వెంకీ, 'మజిలీ' తరువాత చైతు కలిసి నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా టాక్ బాగుంటే వారానికి మించి సినిమా ఆడుతుంది. పైగా జోనర్ చూస్తుంటే అన్ని వర్గాల ఆడియన్స్ కి నచ్చే సినిమాలా ఉంది. ఇదే క్రమంలో మరొక సినిమా బాలకృష్ణ సినిమా కి పోటీగా వస్తున్న అదేమిటంటే ప్రతి రోజు పండగే అనే సినిమా. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాగా విడుదలకానుంది. ఇంకా రెండు మూడు సినిమాలతో పాటు సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమా కూడా అదే సమయానికి విడుదల కావడంతో బాలయ్య బాబు నటించిన 'రూలర్' కి  గట్టిగానే పోతే ఉన్నట్లు తెలుస్తోంది .

 

ఇటీవల 'రూలర్' టీజర్ కూడా విడుదల కావటం టీజర్ లో బాలయ్య బాబు చాలా కొత్తగా కనబడటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మొత్తంమీద చూసుకుంటే డిసెంబర్ నెలలో విడుదల కాబోయే 'రూలర్' సినిమాకి చాలా సినిమాలు పోటీగా వస్తున్నాయి. మరి పోటీని తట్టుకుని బాలయ్య బాబు డిసెంబర్ నెలలో 'రూలర్' సినిమాతో హిట్ కొడతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: