నటవారసుల వెల్లువ సినిమా పరిశ్రమల్లో అంతకంతకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ప్రతియేటా అరడజను పైగానే నటవారసులు తెరకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా యంగ్ బ్యూటీస్ వారసత్వ లెగసీని విజయవంతంగా ముందుకు నడిపించడానికి చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ పోటీ ప్రపంచంలో ఏదైనా అంత ఈజీ కాదు. అందరిని తట్టుకొని తమ ప్రత్యేకత ఏమిటో నిరూపించుకోకపోతే ఇక అంతే సంగతి.

 

ఈ పోటీని పసిగట్టేసిన జాన్వీ- అహనా పాండే- సారా అలీఖాన్- సుహానా ఖాన్ వంటి నటవారసురాళ్లు తమ ప్రత్యేకతను చూపించడానికి ఇన్ స్టా- సామాజిక మాధ్యమాల్లో నిరంతరం హాట్ ఫొటో షూట్లతో హీటెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యాంగ్రీ హీరో రాజశేఖర్ వారసురాళ్లు ఈ రేసులోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కుమార్తెలు శివానీ-శివాత్మిక తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా లక్ చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ అమ్మాయిలిద్దరు వరుస ఫోటోషూట్లతో ఆకట్టుకుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో గ్లింప్స్ ని అభిమానులకు షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

ఆ ఇద్దరిలో శివాత్మిక ఇంకాస్త అడ్వాన్స్ డ్ ట్రీట్ తో అభిమానుల్ని అలరించేందుకు ప్రిపేర్డ్ గా ఉందని అర్థమవుతోంది. తాజాగా శివానీ పోస్ట్ చేసిన ఓ ఫోటో ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగమ్మాయిల్లో ఈ స్పీడ్ ఈ మధ్య కాలంలో చూడలేదనే చెప్పాలి. ఇక శివాత్మిక నటించిన 'దొరసాని' సినిమా అనుకున్న రేంజ్ లో హిట్ అవలేదు. అయినా తన ప్రయత్నాలు మాత్రం చేస్తూనే. మరోవైపు శివాత్మిక అక్క శివానీ కెరీర్ డైలమా గురించి తెలిసిందే. అన్నిటి నుంచి బయటపడి స్టార్ గా తనని తాను నిరూపించుకునేందుకు శివానీ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంది. 2 స్టేట్స్ రీమేక్ అనూహ్యంగా మిడిల్ డ్రాప్ అయ్యింది. అయినా నిరాశ పడకుండా మరో ప్రయత్నం చేస్తోందట. అక్కా చెల్లెళ్ళు హీరోయిన్స్ గా ఎప్పుడు పాపులర్ అవుతారో చూడాలి. ఎందుకంటే రాజశేఖర్-జీవిత ఇద్దరు మంచి నటులు కాబట్టి వారసత్వంగా అది వర్కౌట్ అవుతుందేమో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: