నటుడు, గాయకుడు మరియు స్వరకర్త అయినా హిమేష్ రేషమియా ప్రస్పుత ఇండియన్ ఐడల్ 11  జడ్జ్  అయినా అను మాలిక్ ను రీప్లేస్  చేయనున్నారు.  అనుమాలిక్ 'మీ టూ' ఆరోపణల నేపథ్యంలో  ఇండియన్ ఐడల్ 11 నుండి వైదొలిగారు. కొద్ది రోజుల క్రితం, మ్యూజిక్ రియాలిటీ టీవీ షో ఇండియన్ ఐడల్ 11 నుండి  జడ్జ్ గా   కొనసాగుతున్న అను మాలిక్  'మీ టూ' వివాదం  కారణంగా షో నుండి  వైదొలిగారు.

 

 

 

గాయని  సోనా మోహపాత్రా అనుమాలిక్  పై  లైంగిక వేధింపుల ఆరోపణలను  చేసారు. ఈ విషయం పై ప్రజల  నుండి  ఆగ్రహం పెరగగా అనుమాలిక్  షో నుండి వైదొలిగారు. గాయకులు నేహా భాసిన్ మరియు శ్వేతా పండిట్ లు  కూడా గతంలో అనుమాలిక్  తమ పై  లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆరోపించారు.  ఇప్పుడు, యాక్టర్  మరియు  సింగర్ అయినా   హిమేష్ రేషామియా ను ఇండియన్ ఐడల్ 11 నిర్వాహకులు అనుమాలిక్ స్థానం లో ఇండియన్ ఐడల్ 11 జడ్జ్ గా తెర ముందుకు తెచ్చారు.  

 

 

ఇండియన్ ఐడల్ 11 షో లో జడ్జ్ గా  చేరిన తర్వాత  హిమేష్ ఇలా అన్నారు.  నేను 'సూపర్ స్టార్ సింగర్'లో ఒక భాగం, ఇప్పుడు నా ప్రయాణం' ఇండియన్ ఐడల్ 11 'లో కొనసాగుతోంది. ఇండియన్ ఐడల్ భారతదేశంలో ఎక్కువ కాలం నడుస్తున్న సింగింగ్  రియాలిటీ షోలలో ఒకటి మాత్రమే కాదు, ఇది ఒక  ఐకానిక్  షో  అని పేర్కొన్నారు.  జడ్జ్ ల  ప్యానెల్‌లో ఉండటానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ  నుండి నా బాధ్యత   పెరుగుతుంది.  నేను ఈ సీజన్‌ను అనుసరిస్తున్నాను మరియు ఈ సంవత్సరం అద్భుతమైన గాయకులు ముందుకు వచ్చి, భారతీయ సంగీత పరిశ్రమలో అలజడి ని  సృష్టిస్తున్నారు అని నేను   ఖచ్చితంగా అనుకుంటున్నాను.

 

 

 

గత సంవత్సరం, సోనా మొదటిసారి తనపై ఆరోపణలు చేసినప్పుడు అనుమాలిక్ ఇండియన్ ఐడల్ 10 నుండి తొలగించబడ్డారు. ఏదేమైనా, సోనీ టీవీ ఈ సంవత్సరం  ఇండియన్ ఐడల్ 11 లో  అనుమాలిక్ ను  తిరిగి జడ్జ్  గా నియమించింది, దీనితో సోనాతో సహా చాలా మంది అనుమాలిక్ మరియు సోనీ ఛానల్ కు   వ్యతిరేకంగా తమ  ప్రచారాన్ని తిరిగి ప్రారంభించారు. దీనిమూలంగా సోనీ ఛానల్ తిరిగి అనుమాలిక్ ను షో కు  దూరం చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: