ఇటీవల యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు పూరికి దర్శకుడిగా మంచి బ్రేక్ ని ఇచ్చింది. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని పూరి, ఈ సినిమాతో మళ్ళి ఒక్కసారిగా ఫామ్ లోకి రావడం జరిగింది. ఇక ఆ సినిమా అనంతరం పూరి, విజయ్ దేవరకొండ హీరోగా ఒక సినిమా అతి త్వరలో తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. 

 

ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన కూడా వచ్చింది. పూరి మరియు ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించబోయే ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ సినిమా కథను తన ఫేవరెట్ ప్లేస్ అయిన బ్యాంకాక్ కి వెళ్లి మరీ పూరి రాసుకుని వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథను పూర్తిగా కమర్షియల్ పంథాలో పలు యాక్షన్ సీన్స్ జోడించి తెరకెక్కించనున్నట్లు సమాచారం. తన గత సినిమాల మాదిరిగా కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలానే ముఖ్యంగా యువత మరియు మాస్ ని ఆకట్టుకునే విధంగా పూరి ఫైటర్ ని తెరకెక్కించనున్నాడట. 

 

ఇకపోతే ఈ సినిమా ద్వారా విజయ్ కూడా తన కెరీర్ లో తొలిసారిగా ఒక పవర్ ఫుల్ మాస్ హీరో పాత్రలో దర్శనం ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో జరుగుతోందట. రాబోయే జనవరిలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్న ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు టాక్. మరి ఇప్పటివరకు తాను పోషించని మంచి మాస్ పాత్రలో తొలిసారి నటిస్తున్న విజయ్ కు ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: