ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  తెలుగు లో మహానటి, ఎన్టీఆర్ బయోపిక్, యాత్ర ఈ మద్య విద్యార్థి నేత జార్జిరెడ్డి బయోపిక్ కూడా థియేటర్లో సందడి చేశాయి.  తాజాగా ఇప్పుడు కోలీవుడ్ లో ప్రముఖ నటి, మహానాయకురాలు జయలలిత జీవిత కథ ఆధారంగా ‘తలైవీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు.   బాలీవుడ్ బ్యూటీ కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ మూవీ ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్నారు.  అయితే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ అయ్యింది. కాకపోతే కంగనాను అచ్చం జయలలితగా చూపించే ప్రయత్నం చేశారు.  

 

కానీ అంత సన్నగా ఉన్న బాలీవుడ్ సుందరి అలా లావుగా కనిపించడం కొంత మందికి నచ్చలేదు.. సోషల్ మీడియాలో రక రకాలుగా ట్రోలింగ్ చేశారు.  ఆమె జయలలిత పాత్రకు అస్సలు సూట్ అవదని విమర్శలు కూడా వచ్చాయి. జయలలిత కు ముఖ్య స్నేహితురాలు, ఆమెను నీడలా వెన్నంటి వుంటూ వచ్చిన శశికళ ఎవరా అన్న విషయం పై రక రకాలుగా చర్చలు సాగాయి.  జయలలిత మరణం తర్వాత సీఎం సీటు కోసం శశికళ పెద్ద పన్నాగం పన్నింది..కానీ అక్రమ ఆస్తుల కేసులో జైలు పాలు అయ్యింది.  

 

జ‌య‌ల‌లిత జీవితంలో ముఖ్య వ్య‌క్తి శ‌శిక‌ళ‌. ఈమె పాత్ర చేయాలంటే చాలా గడ్స్ ఉండాలి..అయితే ఆ పాత్రకోసం  నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ప్రియ‌మ‌ణిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. త‌లైవీ చిత్రానికి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్ ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగ‌నా సంద‌డి చేయ‌నుంద‌ట . ఈ మూవీ కోసం కంగ‌నా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తోందని టాక్ న‌డుస్తుంది. మరి శశికళగా ప్రియమణి ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: