కొంతమంది హీరోయిన్స్ మరీ బరితెగించి ప్రవర్తిస్తున్నారు. కట్టు బొట్టులో తేడా చూపించి కవ్విస్తున్నారు. అందినకాడికి దోచేసుకుంటున్నారు. కాదు అని కథ అడ్డం తిరిగితే మాత్రం రివర్స్ లో ఏవో ప్రూఫ్స్ ఉన్నాయని బెదిరించి బ్లాక్ మేయిల్ చేసి ప్రాణాలు తోడేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మరాఠీ హీరోయిన్ సారా శ్రవణ్ ను పూణే పోలీసులు బ్లాక్ మెయిల్ కేసులో అరెస్ట్ చేశారు. ఈమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు దాదాపు ఏడు నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నారంటే ఎంతగా తప్పించుకు తిరుగురుందో ఈ కిలాడి లేడి అర్థమవుతోంది. ఇండియా నుండి పారిపోవడంతో సారా రాక కోసం ఇన్నాళ్లు పోలీసులు వెయిట్ చేశారు. ఇటీవల ముంబయిలో అడుగు పెట్టిన విషయం తెలిసి వెంటనే సారాను ట్రేస్ చేసి అరెస్ట్ చేసినట్లుగా పుణే పోలీసులు ప్రకటించారు. బ్లాక్ మెయిల్ కేసులో సారాను అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు వెళ్లడించారు.

 

సారా గతంలో సుభాష్ యాదవ్ అనే వ్యక్తితో కలిసి ఒక సినిమాలో నటించింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు సుభాష్ పై లైంగిక వేదింపుల కేసును సారా శ్రవణ్ పెట్టింది. ఆ సమయంలోనే తన వద్ద వీడియోలు ఉన్నాయని వాటిని బయట పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. మరో ముగ్గురితో కలిసి సారా ఈ పని చేసినట్లుగా పోలీసులు తెలియజేశారు. 15 లక్షలను సుభాష్ యాదవ్ నుండి రాబట్టేందుకు ఈ గ్యాంగ్ ప్రయత్నించారట.

 

ఈ ఏడాది ఏప్రిల్ లో సుభాష్ యాదవ్ తనను సారా తో పాటుగా మరో ముగ్గురు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సారాను మినహా ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు. సారా దుబాయి పారిపోవడంతో ఆమె రాక కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఇన్ని నెలల తర్వాత ఆమె ముంబయిలో దిగగానే అరెస్ట్ చేశారు. ముందస్తు బెయిల్ పిటీషన్ పెట్టుకున్న సారాకు కోర్టు షాక్ ఇచ్చింది. బెయిల్ వస్తుందనే నమ్మకంతో ఇండియా వచ్చిన సారాకు బెయిల్ రాకపోవడంతో అరెస్ట్ చేయక తప్పలేదు. పూణె కోర్టులో ఆమెను హాజరు పర్చినట్లుగా పోలీసులు తెలియజేశారు. ముందేమో మోజు పడి కామంతో వెళ్ళింది..ఇప్పుడేమో బెదిరించి బ్లాక్ మేయిల్ చేస్తున్నావా అని కొందరు సారాను ఏకిపారేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: