తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ మ్యూజిషిన్స్ లో ఒకడిగా బెస్ట్ ఫేస్ అనుభవిస్తున్నాడు తమన్. గతేడాది తొలిప్రేమ, భాగమతి, అరవింద సమేత.. వంటి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లోకి వచ్చాడు తమన్. ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అల.. వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. రెండు నెలల నుంచి ఈ సినిమా పాటలు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. సామజవరగమన, రాములో రాములా.. పాటలు ఒకదానికొకటి మించి సూపర్ హిట్టై ప్రజల నోట, యూట్యూబ్ రికార్డులతో హోరెత్తుతూనే ఉన్నాయి.

 

 

అయితే.. తమన్ ఎంత మంచి సంగీతం అందించినా తనపై కాపీ క్యాట్ అనే ముద్ర మాత్రం కామన్ గా పడిపోతుంది. అంతేకాదు.. తమన్ పాటలు రిలీజ్ కాగానే అవి ఇంతకుముందు ఏ సినిమాలో వచ్చాయో నెటిజన్లు పనిగట్టుకుని వెతుకుతూంటారు. అలానే రాములో రాములా పాటను కూడా పట్టుకున్నారు. నిజానికి ఈ పాట కాపీ కాదు.. జస్ట్ రాములో రాములా పదాలను వాడుకున్నారు. అయితే తమన్ పలు రీమిక్స్ సాంగ్స్ కూడా చేశాడు. కానీ తమన్ కు రీమిక్స్ చేయడమంటే ఇష్టం లేదట. కానీ దర్శక, నిర్మాతల కోరిక మీదట చేయాల్సి వస్తోందని అంటున్నాడు. ఓసారి దీనిపై ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడట.. రీమిక్స్ చేయొద్దని. కానీ తప్పలేదని అంటున్నాడు.

 

 

రీమిక్స్ వల్ల ఒక్కోసారి ఇబ్బందులు కూడా ఎదురవుతాయని కూడా అంటున్నాడు. ఒరిజినల్ పాటను మ్యాచ్ చేయాలంటే చాలా కష్టపడాలి. గతంలో చేసిన రీమిక్స్ సాంగ్స్ కి ఇబ్బందులు కూడా వచ్చాయట. అయితే ఏ పాటలకు తాను ఇబ్బందులు పడ్డాడు.. మాటలు పడ్డాడు అనేది మాత్రం చెప్పలేదు. మొత్తానికి తమన్ పాటలు గతంలో విన్నట్టు ఉన్నా అప్పటికి మాత్రం ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: