బికిని అనేది ఒక ఫ్యాషన్ డ్రస్ లాగా అయిపోయింది. అది వేసుకోకపోతే సెక్సీగా కనిపించరనే ప్రతీ ఒక్క హీరోయిన్ వయసుతో సంబంధం లేకుండా ట్రై చేస్తున్నారు. అంతేకాదు ఆ బికిని ఫోటోలని సోష మీడియాల్లో పెట్టి నానా రచ్చ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ మినిషా లాంబా పేరు మన తెలుగువాళ్ళలో చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. దాదాపుగా ఇరవై హిందీ సినిమాల్లో నటించిన ఈ బ్యూటి 'కార్పోరేట్'.. 'రాఖీ: ది రెబెల్'.. 'అంటోనీ కౌన్ హై'.. 'హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్' .. 'భేజా ఫ్రై' లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కేవలం సినిమాలే కాదు..హిందీ బిగ్ బాస్ సీజన్-8 లో కూడా పాల్గొంది. ఇతర టీవీ రియాలిటీ షోలలో కూడా యమా హాట్ గా పాల్గొంటుంది. వయసు 34 అయినా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని పెట్టి కుర్ర కారుని వెర్రెక్కించడంలో తన స్టైలే వేరు.

 

తాజాగా మినిషా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోకు "నేనిప్పుడు ఏం చెప్పాను" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక ఫోటో వెయ్యి పదాలకు సమానం అని ఆంగ్లభాషలో ఒక కొటేషన్ ఉంది. మరి బికినీ ఫోటో పోస్ట్ చేసి 'నేనేం చెప్పాను?' అని అడిగితే మనం కూడా గడుసుగా "వెయ్యి పదాలు చెప్పావు లాంబా... ఇదో జంబో మెసేజ్" అని జవాబిస్తే సరిపోతుంది కదా అంటూ నెటిజన్లు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు. ఇక ఈ మినిషా వేసుకున్న ఈ బికిని చూసిన ఫ్యాన్స్ ఎంత భయంకరంగా ఎక్సర్ సైజులు చేస్తుందో మనం ఊహించుకోవచ్చు అంటూ రెచ్చిపోయి మరీ కామెంట్స్ పెడుతున్నారు.

 

అంతేకాదు ఈ ఫోటోకు చాలామంది నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "లాజవాబ్ బికినీ".. "ఏ బికినీ హై దీవాని".. "ఆషిక్ బనాయా ఆప్ కి బికినీ నే"అంటూ రెచ్చిపోయారు. మినిషా సినిమాల విషయానికి వస్తే సంజయ్ దత్ సినిమా 'భూమి'(2017) సినిమాలో చివరిగా నటించింది. ఆ సినిమా తర్వాత మరో సినిమా ఆఫర్ రాలేదు. అందుకేనేమో ఇలా టూ పీస్ బికిని తో ఇన్‌డైరెక్ట్‌గా దర్శక, నిర్మాతలకు సిగ్నల్స్ పంపుతోంది. మరి ఎవరైఅనా ఒక ఆఫర్ ఇస్తారా అని కొన్నాళ్ళు ఆగితే తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: