టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ హిస్టారికల్ మూవీ సైరా నరసింహారెడ్డి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై అత్యంత భారీగా నిర్మించిన ఈ సినిమాపై ప్రేక్షకులు మరియు మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాగా ఎన్నో అంచనాల మధ్య అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా కేవలం యావరేజ్ వద్దే మిగిలిపోయింది. అద్భుతమైన విజువల్స్, భారీ సెట్టింగులు, అత్యద్భుతమైన భారీ ఛేజింగ్ మరియు యాక్షన్ సీన్స్ వంటివి ఉన్నప్పటికీ ఆకట్టుకునే కథ, మరియు కథనాలు లేవని చాలావరకు ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచారు. 

 

దాదాపుగా రూ.200 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కిన ఆ సినిమా ఓవర్ అల్ గా అన్ని భాషల్లో కలిపి రూ.137 కోట్ల వరకు మాత్రమే షేర్ ని రాబట్టగలిగిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇక ఉత్తరాంధ్ర మినహా చాలా చోట్ల కూడా నష్టాలు తెచ్చిపెట్టిన ఈ సినిమా, అటు హిందీలో కూడా భారీ నష్టాలు తెచ్చిపెట్టినట్లు టాక్. ఇకపోతే ఈ సినిమాను ఇటీవల డిజిటల్ మాధ్యమం అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సినిమా డిజిటల్ హక్కులు అమెజాన్ వారికి రూ.30 కోట్లవరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. అయితే అమెజాన్ లో హిందీ తప్ప తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా

 

అన్ని భాషల ఆడియన్స్ నుండి విశేషమైన స్పందనను రాబడుతూ మంచి వ్యూయర్ షిప్ తో తో ముందుకు సాగుతుందంట. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వ్యూస్ పొందిన సినిమాల్లో సైరా కూడా ఒకటని సమాచారం. సో, ఈ విధంగా చూస్తే బాక్సాఫీస్ పరంగా చాలావరకు నిరాశ పరిచిన సైరా సినిమా, డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ లో మాత్రం దూసుకెళ్లడం ఎంతో ఆనందంగా ఉందని మెగాఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: