మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా గా తెరకెక్కిన సైరా సినిమా అదరగొట్టే విజయం సాధించడంతో అదే స్థాయిలో నెక్స్ట్ సినిమా విజయం సాధించాలని కొరటాలతో సినిమా చిరంజీవి ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు కొరటాల శివ తెరకెక్కించిన సినిమా ఏది కూడా పరాజయం కాకపోవటంతో కొరటాలతో చిరంజీవి సినిమా సెట్ చేయడం జరిగింది. అయితే గతంలో తాను నటించిన ‘సైరా’ సినిమా దాదాపు షూటింగ్ రెండు సంవత్సరాలు జరుపుకోవడంతో నెక్స్ట్ కొరటాలతో చేయబోయే సినిమా అంత టైం ఇవ్వకుండా చాలా తక్కువ టైమ్ లోనే పక్కా ప్లానింగ్ తో సినిమా కంప్లీట్ అయ్యేవిధంగా చిరంజీవి అండర్ గ్రౌండ్ వర్క్ డైరెక్టర్ కొరటాలతో చేయిస్తున్నట్లు సమాచారం.

 

సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు దసరా పండగ రోజు అధికారికంగా జరగగా ...ఆ తర్వాత సినిమాకి సంబంధించి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ప్రస్తుతం మెగా అభిమానులు కాస్త నిరుత్సాహంగా ఉన్న ...చిరంజీవి మాత్రం ఎటువంటి వార్త సినిమాకి సంబంధించి బయటకు వెళ్ళకుండా లోలోపల అండర్ గ్రౌండ్ వర్క్ జరిగి పోయేలా వ్యవహరిస్తూ సినిమా చాలా తక్కువ టైమ్ లోనే కంప్లీట్ అయ్యేవిధంగా చిరంజీవి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినపడుతున్నాయి. ఇందులో భాగంగా సినిమాకు లోలోపల జరగాల్సిన పనులు మాత్రం జరిగిపోతున్నాయి అని లేటెస్ట్ టాక్ వినిపిస్తుంది.

 

ఈ గ్యాప్ లో మొదటగా చిత్ర యూనిట్(కొరటాల,మణిశర్మ) ట్యూన్స్ మరియు ఇతర మ్యూజిక్ పార్ట్ కోసం కూర్చొని మొత్తం సెట్ చేసి ఫైనలైజ్ చేసేసారని అందుకే సినిమా కోసం ఏ అప్డేట్ ఇంకా బయటకు వదల్లేదని తెలుస్తుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. గతంలో చిరంజీవి నటించిన చాలా బ్లాక్ బస్టర్ సినిమాలకు మణిశర్మ మ్యూజిక్ అందించడంతో….చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ చిరంజీవి సినిమాకు మణిశర్మ వర్క్ చేయడంతో ఈ సినిమాపై మెగా అభిమానుల్లో భీభత్సమైన అంచనాలు నెలకొన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: