గత రెండేళ్ల నుండి ఒక్క హిట్ సినిమా కూడా లేకుండా సతమతమవుతున్న హీరో మాస్ మహారాజ రవితేజ. వరుస డిజిటర్స్ తో భాదడపడుతూ ఉన్న రవితేజ ఇప్పుడు కొత్త సినిమాలో నటిస్తున్నారు సినిమా కథ కొత్తగా ఉన్న కూడా రవితేజ గ్రెస్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. రవితేజ సినీ కెరియర్ లో ఎప్పుడు చూడని విదంగా ఈ సినిమా తెరకెక్కనుంది. 

 

అసలు విషయానికొస్తే ఈ సినిమా లోని యాక్షన్స్ సీన్స్ కోసం హాలీవుడ్ ఫైట్ మాస్టర్స్ తో ఈ సినిమాకు ఫైట్స్ చేయించారు. ఇకపోతే సినిమా కొత్తగా ఉండాలని ఈ సినిమాకు డిస్కో టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే భారీ బడ్జెట్ కథతో తెరకెక్కిన్న ఈ సినిమాలో సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయని చిత్ర యూనిట్ వెల్లడిస్తున్నారు.. 

 

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై రవి తేజ భారీ అంచనాలే పెట్టుకున్నారు. వి ఐ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎస్ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై తాళ్లూరి నిర్మిస్తున్నారు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మొదట డిసెంబర్ 20 వ తేదీన  విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన కూడా ఈ సినిమా విడుదల తేదీలో మార్పులు రావొచ్చునని వార్తలు వినపడుతున్నాయి. 

 

ఈ నేపథ్యంలో జనవరి 24వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా, విలన్ పాత్రలో బాబీసింహా కనిపించనున్నాడు. భారీ యాక్షన్స్, బడ్జెట్ తో రూపొందినఈ సినిమా రవితేజ కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని దర్శక నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏ రేంజులో హొయ్త్ అవుతుందో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: